Stock Market: రోజంతా ఊగిసలాట.. రెండు రోజుల తర్వాత ఊరట.. క్లోజింగ్ సమయంలో..
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపించింది. ఉదయం నుంచి స్వల్ప నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. రెండవ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లకు లభించిన అండతో లాభాల్లో ముగిశాయి.

అమెరికా మార్కెట్లు..
తాజాగా ఫెడ్ తన వడ్డీ రేట్లను మరోసారి 75 బేసిస్ పాయింట్లను పెంచటంతో అమెరికా మార్కెట్ల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు సైతం యూఎస్ మార్కెట్లు వరుసగా నాలుగు రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. US ఫెడ్ తన కఠినమైన ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2% తగ్గించడానికి FOMC కట్టుబడి ఉందని ఫెడ్ స్పష్టం చేసింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగో సారి.

మార్కెట్ సూచీలు..
బెచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 79 పాయింట్లు నష్టంతో ముగిశాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో రెండు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు నేడు తేరుకున్నాయి. అయితే ఈ రోజు విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లకు అండగా నిలిచారని చెప్పుకోవాలి.

టాప్ గెయినర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎస్బీఐఎన్, యూపీఎల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, విప్లో, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ స్టాక్స్ లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు మార్కెట్ క్లోజింగ్ సమయానికి నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications