సెన్సెక్స్ నేటి కనిష్టం నుండి 1500 పాయింట్లు జంప్, పడిలేచిన సూచీలు
స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 28) భారీ నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్‌లో రష్యా సేవల దాడుల నేపథ్యంలో మార్కెట్లు నేడు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఈ రెండు దేశాల చర్చల నేపథ్యంలో మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా మార్కెట్లు దూకుడు కొనసాగించాయి. దీంతో ప్రారంభ భారీ నష్టాల నుండి సూచీలు 1400 పాయింట్ల మేర పుంజుకున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 55,329 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,324 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,833.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,481 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,815 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,356 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 388 పాయింట్లు లేదా 0.70 శాతం లాభపడి 56,247 పాయింట్ల వద్ద, నిప్టీ 135 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 16,794 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్ల మేర పైకి కిందకు కదలాడి, చివరకు నేటి కనిష్టం నుండి 1400 పాయింట్ల లాభాల్లో, నిన్నటితో పోలిస్తే 388 పాయింట్ల లాభాల్లో ముగిసింది.

ఉక్రెయిన్‌లో రష్యా వరుసగా ఐదో రోజు దాడులు కొనసాగించింది. మరోవైపు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు పుతిన్. తమ సైన్యాన్ని అణ్వస్త్రాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ అనిశ్చితి మధ్య ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత శాంతి చర్చల నేపథ్యంలో సుచీలు పుంజుకున్నాయి.


Click it and Unblock the Notifications