IPO News: భూకంపం సృష్టించిన ఐపీవో.. తొలిరోజే పూర్తి నిరాశలో ఇన్వెస్టర్లు.. మీరూ కొన్నారా..??
Benchmark Computer IPO: ఈరోజు మార్కెట్లోకి వచ్చిన రెండవ ఐపీవో మాత్రం ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది. దీంతో ఐపీవలో షేర్లను పొందిన పెట్టుబడిదారులు షాక్ అవుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో పెట్టుబడిదారులతో దోబూచులాట ఆడింది. వాస్తవానికి బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.80 రేటు వల్ల లిస్టింగ్ అయ్యాయి. ఇది కంపెనీ గరిష్ఠ ఇష్యూ ధర రూ.66 కంటే 21.21 శాతం అధికం. ఇంత వరకు వ్యవహారం బాగానే ఉన్నప్పటికీ.. జాబితా అయిన కొద్దిసేపటికే స్టాక్ ధర భారీ క్షీణతకు లోనైంది.

లిస్టింగ్ అయిన కొద్ది సేపటిటే షేర్లు 16 శాతం మేర క్షీణించటంతో ఇన్వెస్టర్ల సంతోషం ఆవిరైపోయింది. ఐపీవో ఊరించి ఉసూరుమరిపించటంతో ఐపీవోలో షేర్లు అలాట్ అయినవారు సైతం ఆందోళన చెందుతున్నారు. బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ IPO పెట్టుబడిదారుల నుంచి బలమైన ప్రతిస్పందనను పొందినప్పటికీ డీలా పడింది. ఇష్యూ రిటైల్ కేటగిరీ 590.26 రెట్లు, ఇతర కేటగిరీలు 357.89 రెట్లు సబ్‌స్క్రైబ్ పొందాయి. అలాగే ఐపీవోలో పాల్గొనేందుకు లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించింది.
బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ లిమిటెడ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సేవలు, IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ సేవలను అందిస్తుంది. కంపెనీ ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ సొల్యూషన్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి సాంకేతిక సంబంధిత సేవలను అందిస్తుంది. ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్(పాస్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్(ఐఎఎఎస్), సాఫ్ట్‌వేర్-ఎ-సర్వీస్(సాస్)తో సహా అన్ని సర్వీస్ మోడల్‌లను కంపెనీ అందిస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సమయంలో కంపెనీ ఆదాయం 70.21 శాతం పెరగగా పన్నుల తర్వాత లాభం 145.43 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications