Stock Market: లాభాల కోలాహలం.. 72,000 దాటేసిన సెన్సెక్స్.. నిఫ్టీ సరికొత్త రికార్డుల మోత..
Market Closing: ఉదయం లాభాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో భారీ ర్యాలీని నమోదు చేశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డులను తాకాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 702 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 206 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 539 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 158 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఈ క్రమంలో నేడు సూచీలు రికార్డుల మోత మోగిస్తూ సెన్సెక్స్ 72000 వేల మార్కును అధిగమించగా.. నిఫ్టీ కొత్త జీవిత కాల గరిష్టం 21673.80ను తాకింది.

ప్రధానంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియటంతో ఆ ప్రభావం దేశీయంగా సూచీల ర్యాలీకి ప్రేరణను అందించింది. వాస్తవానికి ఏడాది చివరి వారం, పండుగల సమీపించటంతో మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్స్ సైతం తక్కువగా నమోదవుతున్నాయి. నేడు ఎనర్జీ మినహా అన్ని రంగాలు లాభాలతో తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
NSEలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, ఎయిర్ టెల్, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బ్రిటానియా, యూపీఎల్, సిప్లా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, విప్రో, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications