Nifty Records: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌తో పాటు బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం ఇటీవల సరికొత్త జీవితకాల రికార్డులను తాగాయి.
నిఫ్టీ వరుసగా ఆరవ వారంలో 3.46 శాతం లాభాన్ని నమోదు చేసింది. జూలై 2022 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదలగా డేటా చెబుతోంది. దీంతో నిఫ్టీ సూచీ మూడేళ్ల కాలంలో సుదీర్ఘమైన వారపు లాభాలను నమోదు చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. ఈ క్రమంలో నిఫ్టీ శుక్రవారం 21,000 ఎగువకు చేరుకుంది. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి 68.3 పాయింట్లు పెరిగి 20,969.4 పాయింట్ల వద్ద ప్రయాణాన్ని ముగించింది.

ఎన్‌ఎస్‌ఈలో నగదు మార్కెట్ పరిమాణం రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువగానే ఉంది. నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లోలు తగ్గుముఖం పట్టాయి. స్మాల్, మీడియం, లార్జ్, మల్టీ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. మేనేజ్డ్ ఈక్విటీ పథకాల్లో నికర పెట్టుబడి అంతకు ముందు నెలతో పోలిస్తే 22.15 శాతం తగ్గి రూ.15,536.4 కోట్లకు చేరుకుంది. నవంబర్‌లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు SIP పెట్టుబడులు మెుత్తం రూ.17,703 కోట్లుగా ఉంది.
తాజాగా రిజర్వు బ్యాంక్ నిర్వహించిన ఎంపీసీ సమావేశంలో సైతం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో కీలక రెపో రేటు 6.5 శాతంగా కొనసాగిచాలని ఆర్‌బీఐ ఎంపీసీ శుక్రవారం ఏకగ్రీవంగా ఓటు వేసింది. వడ్డీ రేట్లలో MPC ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది వరుసగా ఐదవసారి కావటం గమనార్హం. శుక్రవారం రోజువారీ చార్టులో నిఫ్టీ దాదాపు హై వేవ్ బాటమ్ ప్యాటర్న్‌ను ఏర్పరుచుకుంది. నిఫ్టీ ఇప్పుడు 20,850-21,050 బ్యాండ్‌లో సమీప కాలానికి కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications