H-1B వీసా అంటే చాలా మందికి వాళ్ళ "అమెరికా డ్రీమ్"కి ఇది ఒక మొడటి అడుగులా భావిస్తారు. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం, పెద్ద జీతం, మంచి జీవితం ఇదే ఊహ. కానీ ఒక అమెరికన్ మహిళ చెబుతున్న కథ మాత్రం... ఈ డ్రీమ్ వెనక ఉన్న అసలు రియాలిటీ ఎలా ఉందొ చెప్తుంది.
ఆమె భర్త భారతదేశం నుండి H-1B వీసా ద్వారా అమెరికాకి వచ్చాడు. చదువుతో తన భవిష్యత్తు నిర్మించుకోవడానికే అతని ప్రయాణం. ఉన్నత మధ్యతరగతి కుటుంబం, మంచి చదువు, పెద్ద కలలు... కానీ వీసా వ్యవస్థ కారణంగా చివరికి ఒకే కంపెనీకి కట్టిపడేసింది. ఉద్యోగం మార్చాలంటే వీసా రిస్క్ జీతం గురించి మాట్లాడాలంటే వీసా రద్దు భయం. ఇలా ఒక్క కంపెనీకి కట్టిపడేసిన పరిస్థితి.

టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఔట్‌సోర్సింగ్ కంపెనీలు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో H-1B దరఖాస్తులు వేసి లాటరీలో భారీగా ఉద్యోగులను పొందుతాయి. వీరు అమెరికాకు వచ్చాక వారిని పెద్ద కంపెనీలకు సబ్‌కాంట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ ఉద్యోగాలు హైటెక్ కాదు అవి హెల్ప్ డెస్క్, QA టెస్టింగ్, ఐటీ సపోర్ట్ లాంటివి. స్థానిక అమెరికన్ గ్రాడ్యుయేట్లు సులభంగా చేయగల పనులు. కానీ H-1B వర్కర్స్ తక్కువ జీతాలకు, మాట వినే వర్క్‌ఫోర్స్‌గా అందుబాటులో ఉంటారు. ఒకసారి ఈ వీసా మీద ఉద్యోగం దొరికితే, మాట విప్పడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. ఉద్యోగం వదిలేస్తే వీసా పోయే ప్రమాదం కాబట్టి చాలా మంది ఈ బంధంలో ఇరుక్కుంటారు.
అమెరికా కార్మిక శాఖ వివరాల ప్రకారం, గత కొన్నేళ్లలో H-1B ఉద్యోగాల్లో 60% ఉద్యోగాలు కనిష్ట వేతన స్థాయిలోనే ఆమోదం పొందాయి. చట్టపరంగా కూడా సంస్థలు మార్కెట్ రేటుకంటే తక్కువ జీతం ఇవ్వడానికి వీలు ఉంది. వలస ఉద్యోగులకు సాధారణంగా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. దీని వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగుల వేతనాల పై కూడా దిగువ ఒత్తిడి ఏర్పడుతోంది. కొన్నిసార్లు అయితే పరిస్థితి ఎంతవరకు వెళ్తుంది అంటే అమెరికన్ ఉద్యోగులు తమ స్థానంలో పనిచేయబోయే H-1B వర్కర్లకు స్వయంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
ఈ వ్యవస్థ రెండు వర్గాలపై ప్రభావం చూపిస్తుంది కానీ లాభం మాత్రం ఒక్కరికి మాత్రమే వెళ్తుంది. అమెరికన్ ఉద్యోగులు తక్కువ ఖర్చు కోసం అవకాశాలను కోల్పోతున్నారు, అదే సమయంలో వలస ఉద్యోగులు వీసా పై ఆధారపడి తమ అర్హతలకు సరిపడని తక్కువ జీతాల్లో ఉండి పోతున్నారు. తను చెప్పే మాటలు ప్రకారం ఎలోన్ మస్క్ లాంటి బిలియనీర్లు H-1B వీసాలను పెంచడానికి కోరతారు అది డైవర్సిటీ కోసం కాదు. నిజానికి, ఈ వ్యవస్థ ద్వారా కంపెనీలు అమెరికన్ ఉద్యోగులనూ, వలస ఉద్యోగులనూ ఇద్దరినీ నియంత్రణలో ఉంచి తమ లాభాలను పెంచుకుంటాయి.
వ్యవస్థలో కొన్ని మార్పులు అవసరం అని ఆమె సూచిస్తోంది. మొదట, వేతన కనిష్ఠాన్ని పెంచి H-1B వీసాలు నిజంగా హై స్కిల్ జాబ్స్‌కి మాత్రమే ఇవ్వాలి. అలాగే ఔట్‌సోర్సింగ్ కంపెనీలు వీసా స్పాన్సర్ అవ్వకూడదు, కేవలం డైరెక్ట్‌గా ఉద్యోగులను నియమించే కంపెనీలకు మాత్రమే అనుమతి ఉండాలి. ఉద్యోగులు తమ వీసా ప్రమాదం లేకుండా కంపెనీ మార్చుకునే అవకాశం కలిగి ఉండాలి. చివరగా, H-1B అప్లికేషన్లను పరిమాణం లేదా కంపెనీ ప్రభావం కంటే నిజమైన నైపుణ్యాన్ని ఆధారంగా సెలెక్ట్ చేయాలి.
ప్రతి సంవత్సరం సుమారు 85,000 కొత్త H-1B వర్కర్లు అమెరికాకు వస్తారు. మొత్తం మార్కెట్లో ఇది చిన్న సంఖ్య అయినా, వాటి ప్రభావం చాలా పెద్దది. H-1B వీసా వాస్తవానికి ఇన్నోవేషన్‌కు సహాయపడే ప్రోగ్రాం కానీ సరైన నియంత్రణ లేకుంటే ఇది కంపెనీలకు వర్కర్లను నియంత్రించడానికి ఒక మార్గంగా మారుతుంది. ఈ మహిళ చెప్పింది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు అది మొత్తం వ్యవస్థలోని లోపాలను చూపించే ఒక మానవ కథ. ఆమె భర్తకు H-1B వీసా అమెరికా కలను ఇవ్వకపోగా, ఒక గందరగోళ పరిస్థితిలో పడేసింది.
More From GoodReturns

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications