1.5లక్షల జాబ్ మానేసిన బెంగళూరు మహిళ.. ఏంచేస్తుందో చూస్తే షాకే..
బెంగుళూరుకు చెందిన ఓ మహిళ బేకింగ్‌పై ఇష్టంతో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసిన సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్తున్న నా భార్య అస్మితా పాల్ బేకింగ్‌లో పూర్తి స్థాయి వృత్తిని కొనసాగించడానికి తన ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా ఆమె భర్త సాగర్ తెలిపారు.
"నా భార్య వీటిని తయారు చేయడానికి 1.5లక్షల శాలరీ ప్యాకేజ్ ఇచ్చే జాబ్ విడిచిపెట్టింది. థ్యాంక్ గాడ్, "అంటూ సాగర్ చేసిన పోస్ట్ లో తన భార్య చేసిన మఫిన్ ఫోటో షేర్ చేసాడు. సోషల్ మీడియా యూజర్లు సాగర్ చేసిన పోస్ట్‌ను అభినందిస్తూ ప్రశంసలు కురిపించడంతో అస్మిత స్టోరీ ఇంటర్నెట్‌ను థ్రిల్ చేసింది.

"బోల్డ్ మూవ్! ఆమె విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఒక యూజర్ కామెంట్ చేయగా మరొక యూజర్ "ఒక 30 LPA ఉద్యోగం కూడా సాటిస్ఫాక్షన్ అందించదు, ప్రజలు దీని నుండి నేర్చుకోవాలి. మీ హృదయం నిజంగా కోరుకునేది అదే అయి ఉండాలి అంటూ ట్వీట్ చేసారు. అస్మితను అభినందిస్తూ, తన ఇష్టాన్ని అనుసరిస్తున్నందుకు పలువురు యూజర్లు కూడా ఆమెను ప్రశంసించారు.
అస్మిత పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో పుట్టి పెరిగింది. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ & బిజినెస్ మేనేజ్‌మెంట్ నుండి MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అస్మిత 2020లో నుండి బేకింగ్ చేయడం ప్రారంభించింది. ఇందుకు Lavonne Academy of Baking Science and Pastry Arts నుండి సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేసిన తర్వాత వృత్తిపరంగా బేకింగ్ చేయడం స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న అస్మితా పాల్ కెరీర్‌ను బేకింగ్ వైపు మార్చుకోవాలని నిర్ణయించుకోవడానికి కారణం అడిగినప్పుడు "బెంగళూరు అవకాశాల నగరం, 12 నెలల ఖర్చులు ఆదా చేసుకోండి, మీరు ఉద్యోగం నుండి నిష్క్రమించే ముందు మీ ఆలోచనను క్లారిటీ చేసుకోండి అలాగే మీపై నమ్మకం పెట్టుకోండి, అంటూ కెరీర్ మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి అస్మిత ఒక సలహా కూడా ఇచ్చింది. అలాగే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా బేకింగ్ ఫుడ్స్ విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications