బంగారం ధర గత కొంత కలంగా ఆకాశాన్ని తాకుతుంది. దింతో ప్రజలు బంగారాన్ని కొనడానికి మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. మన దేశంలో నకిలీ నోట్లలగే నకిలీ బంగారం, బంగారం అమ్మకాల మోసాలు జరుగుతున్నాయి. ఇంకా అధిక ధరల కారణంగా మార్కెట్లో నకిలీ బంగారం చూపెట్టి మోసాలకి పాల్పడుతున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేసే కస్టమర్లు నమ్మకం ఇంకా నాణ్యత చెక్ చేసి కొనుగోలు చేయాలి. అంతేకాదు ఇప్పటికి చాలా మంది ప్రజలు నమ్మకమైన షాపులు లేదా బ్రాండ్ స్టోర్ నుండి మాత్రమే నగలు కొనేందుకు ఇష్టపడుతుంటారు.

కానీ అందరికి ప్రముఖ బ్రాండ్ల జ్యువెలరీ స్టోర్లకి వెళ్ళే స్థోమత ఉండదు. కొంతమంది గ్రామాల్లో నివసిస్తుంటారు, విరికి సమీపంలోని నగల షాపులే బెస్ట్ అప్షన్. కాబట్టి బంగారం కొనుగోలు చేసే వారు బంగారు ఆభరణాల స్వచ్ఛతను చెక్ చేయడానికి, తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అయితే కొంతకాలం క్రితం బంగారం అమ్మకాల పై మోసాల సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలో 18 క్యారెట్ల బంగారాన్ని ఇంకా 22 క్యారెట్ల బంగారం విక్రయించే చాల షాపులు ఉన్నాయి. కాబట్టి నిజమైన బంగారాన్ని గుర్తించడం ఎలా అంటే..
BIS హాల్‌మార్క్: బంగారం కొనే వారు గమనించవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి BIS హాల్‌మార్క్. బంగారం స్వచ్ఛతను గుర్తుంచడానికే ఈ ముద్ర వేస్తారు. 22 క్యారెట్ల బంగారం అయితే ఆభరణాలపై హాల్‌మార్క్ 22K916 ఉండాలి. 22 క్యారెట్ల బంగారంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఈ గుర్తు కనిపించకపోతే లేదా స్పష్టంగా లేకపోతే, బంగారం నాణ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
కస్టమర్లు కొనుగోలు చేసే ఆభరణాలపై హాల్‌మార్క్ స్టాంప్‌తో పాటు నంబర్ కూడా ఉందా? అని గమనించాలి. ఈ నంబర్ అన్ని హాల్‌మార్క్ చేసిన ఆభరణాలపై ముద్రించి ఉంటుంది. ఈ నంబర్ ఉన్న ఆభరణాల వ్యాపారి స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయబడిందా లేదా అనే దాన్ని వెల్లడిస్తుంది. ఈ నంబర్ మీకు ఆభరణాల తయారీ వివరాలను తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
రిసిప్ట్: కొంతమంది నకిలీ బంగారు ఆభరణాల విక్రేతలు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లను మోసం చేయడానికి నకిలీ హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తారు. దీనిని నివారించడానికి ప్రజలు క్యారెట్ విలువ, బరువు, ప్రాసెసింగ్ ఫీజు ఇంకా పన్నుతో కూడిన రిసిప్ట్ అడిగి మరి తీసుసుకోవాలి
గోల్డ్ టెస్టింగ్ మెషిన్: చాల వరకు బ్రాండెడ్ నగల షాపులు ఇప్పుడు సర్టిఫైడ్ గోల్డ్ టెస్టింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నాయి. ఈ మెషీన్స్ బంగారం స్వచ్ఛతను మీ ముందే ఇంకా ఖచ్చితంగా చెక్ చేయడంలో సహాయపడతాయి.
అయస్కాంత పరీక్ష: అయస్కాంత పరీక్ష ఒక సులభమైన పరీక్ష. మీరు పరీక్షించాలనుకుంటున్న బంగారానికి దగ్గరగా అయస్కాంతాన్ని పెట్టండి. బంగారం అయస్కాంతం వైపు ఆకర్షితమైతే నకిలీ కావచ్చు. కాకపోతే ఎక్కువ క్యారెట్ విలువ ఉన్న బంగారం కావచ్చు. మీరు ఒక అయస్కాంతాన్ని దాని దగ్గరకు ఉంచినప్పుడు బంగారం కదులుతుంటే, అందులో ఇతర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఇనుము ఇంకా నికెల్. అంతేకాదు అది కల్తీ బంగారం కూడా కావచ్చు.


Click it and Unblock the Notifications