Beer Stock: దేశంలో మద్యం ప్రియుల సంఖ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వాటిని ఉత్పత్తి చేసే డిస్టిలరీల ఆదాయానికి ఢోకా లేకుండా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు..
బీర్ విక్రయించే సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇది నిజంగానే పెద్ద శుభవార్త. సోమవారం నాడు బీర్ విక్రయాలను తమ రాష్ట్రంలో జరిపేందుకు కంపెనీకి రాజస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఇకపై కంపెనీ ఉత్పత్తులు రాజస్థాన్‌లో అందుబాటులో అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల కంపెనీ విక్రయాలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు పోటీ పడ్డారు. దీంతో స్టాక్ నేడు దాదాపు 4.65 శాతం మేర లాభపడగా.. షేర్ ధర రూ.318 స్థాయికి చేరుకుంది.

సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్ బీర్ ఇప్పటి నుంచి రాజస్థాన్‌లో అందుబాటులో ఉంటుంది. దేశంలో ఐదవ అతిపెద్ద రాష్ట్రంలో బీర్ విక్రయాలకు సరఫరాకు అనుమతులు లభించినట్లు కంపెనీ ప్రకటన ద్వారా వెల్లడించింది. రానున్న కాలంలో రాజస్థాన్‌లో మెజారిటీ మార్కెట్ వాటాను సాధించడానికి ప్రయత్నిస్తామని.. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తారించాలని చూస్తున్నట్లు వెల్లడించింది.
ఈరోజు BSEలో సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్ షేర్లు రూ.301.35 స్థాయిలో ప్రారంభమయ్యాయి. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు రూ.318 స్థాయికి చేరుకున్నాయి. జూలై 15, 2022న సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్ షేరు ధర రూ.69.90గా ఉంది. ఈ లెక్కన అప్పటి నుంచి కంపెనీ షేర్ల ధరలు నాలుగు రెట్లకు పైగా పెరిగాయి.
కేవలం 6 నెలల క్రితం ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 148 శాతానికి పైగా లాభపడ్డారు. అలాగే గడచిన నెలరోజుల్లో స్టాక్ ఇన్వెస్టర్లకు 18 శాతం మేర రాబడిని అందించింది.


Click it and Unblock the Notifications