బీర్ కష్టాలు: మండే వేసవిలో చుక్క దొరక్క మందుబాబులు.. ఎందుకీ పరిస్థితి?
వేసవి కాలం వచ్చిందంటే చాలు, చల్లని ఆహార పదార్థాలతో పాటు చల్లని పానీయాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది బీర్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణ రోజులతో పోలిస్తే, సమ్మర్‌లోనే బీర్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి చాలామంది బీరును ఒక మంచి అప్షన్'గా భావిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో బీర్ విషయంలో కూడా ఇలాంటి ఒక వింత పరిస్థితి నెలకొంది. ఏంటంటే దేశ రాజధానిలో భారతీయ తయారీ బీర్ బ్రాండ్ల కొరత ఏర్పడింది. దింతో ప్రభుత్వ స్టోర్లు, బార్-రెస్టారెంట్లలో కూడా బీర్లు అందుబాటులో లేకుండా పోయాయి.

నేపాలీ అండ్ భూటాన్ బీర్ సీక్రెట్ : ఢిల్లీలో బీర్ బ్రాండ్ల కొరత మధ్య, స్పష్టంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే నగరంలో ప్రతిచోటా భూటాన్, నేపాల్ నుండి వచ్చే బీర్లు కనిపిస్తాయి. ఈ బీర్లను షాపుల్లో అందరికి కనిపించేల ఉంచుతారు. దింతో ప్రజలు దానిని చూసిన వెంటనే కొంటుంటారు. ఈ విదేశీ బీర్లు ఎందుకు ఇంత మొత్తంలో వస్తున్నాయి అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుండవచ్చు.
విదేశీ బీర్లు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే :దీనికి చాల కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మొదటిది ప్రభుత్వ విధానాలు సరిగ్గా పనిచేయకపోవడం. రెండవది కొంతమంది వ్యక్తులు కొన్ని బ్రాండ్‌లను మాత్రమే ప్రమోట్ చేస్తుంటారు. మూడవది దీనిలో ఎక్కువ లాభం ఉండడటం. నిజానికి భూటాన్, నేపాల్ నుండి వచ్చే బీరుపై ఎటువంటి పన్ను లేదు. అందువల్ల, ఈ బీరు అమ్మే వ్యాపారవేత్తలు ఎక్కువ లాభం పొందుతారు.
ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా నుండి : ఢిల్లీలోని ప్రజలు తమకు నచ్చిన బీరు దొరకనప్పుడు హర్యానా ఇంకా ఉత్తరప్రదేశ్‌లకు వెళ్లి కూడా కొంటుంటారు. పరిశ్రమ డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీలో బీర్ అమ్మకాలు 37% తగ్గాయి, అయితే దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 10% పెరిగింది. ఢిల్లీలో తగినంత బీర్లు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.
దిగుమతి చేసుకున్న బీర్లలో ఎక్కువ లాభం: ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, డ్యూటీ ఫ్రీ బీర్లు అధిక లాభాలను అందిస్తున్నందున అమ్మకందారులలో ఎక్కువ ప్రజాదరణ పొందాయని అన్నారు. ఈ బ్రాండ్లు అమ్మకందారుల రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకా కస్టమర్లు వచ్చినప్పుడు మొదట చల్లటి బీర్ అడుగుతారు. ఏదైనా ఒక బ్రాండ్ మాత్రమే చల్లటి బీర్ ఉందని చెప్పినప్పుడు దానిని తప్పక కొనుగోలు చేయాల్సి వస్తుంది" అని అన్నారు.


Click it and Unblock the Notifications