Nykaa News: చాలా మంది ఐపీవోలో పెట్టుబడులు పెట్టేందుకు అప్పులు చేసి మరీ లాభాల కోసం పోటీపడుతుంటారు. కానీ ఇప్పుడు మాట్లాడుకోబోతున్న కంపెనీ మాత్రం ఐపీవో తర్వాత 87 శాతం విలువను కోల్పోయింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నైకా కంపెనీ షేర్ల గురించే. బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిటైలర్ నైకా ఇన్వెస్టర్ల పరిస్థితి అద్వానంగా మారిపోయింది. కంపెనీలో కీలక పాత్రల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా రాజీనామాలు చేస్తున్న వార్తలు ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 6 మంది సీనియర్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఆగస్టు 2న ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో నైకా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ షాలినీ రాఘవన్ కూడా రాజీనామా చేశారు. నైకా సూపర్‌స్టోర్ CEO వికాస్ గుప్తా, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ అస్థానా, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మనోజ్ గాంధీతో సహా ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని విడిచిపెడుతున్నట్లు కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం తేలింది. దీంతో నైకా షేర్లు నిరంతరం పడిపోతున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 2.41 శాతం క్షీణించి రూ.143.55 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ, వ్యయ హేతుబద్ధీకరణ, వ్యాపారంలో పెరుగుతున్న సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుని నాయకత్వ పాత్రలు పెంచబడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో, రిటైల్ స్టోర్ల ద్వారా బ్యూటీ ఉత్పత్తుల విక్రయంలో కంపెనీ తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇదే రంగంలో వ్యాపారాలు కలిగి ఉన్న టాటా గ్రూప్, రిలయన్స్ కంపెనీలతో నైకా ప్రస్తుతం పోటీ పడుతోంది. 2021 నవంబరులో ఐపీవోగా మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీ షేర్లు ప్రస్తుతం 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.246.16 నుంచి 41 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. ఈ స్టాక్ ప్రస్తుతం దాని IPO ధర కంటే 87% దిగువన ట్రేడవుతోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications