సాధారణంగా EMI అంటే టీవీలు, ఫ్రిడ్జీలు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు పెడుతుంటారు. జీతం డబ్బులు సరిపోకపోవడం లేక కోనుగోలు శక్తి లేకపోవడం వల్ల చాలామంది వస్తువు కొనుగోలు చేసిన తర్వాత నెల నెలా ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసింది. వస్తువులకే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా లోన్లు ఇస్తున్నాయి కొన్ని ఫిన్ టెక్ కంపెనీలు. జుట్టు పెంచుకోవాలా? మోముని మెరిపించాలా? పళ్లను వైట్ చేయించుకోవాలా? బటాక్స్ వేయించుకోవాలా? ఏదైనా సరే మీకు మేము ఈఎంఐ ఇస్తామంటూ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
ఉదాహరణకు.. 24 ఏళ్ల సంధ్య అనే యువతి హైదరాబాద్ లో VLCC క్లినిక్‌లో తన ఫస్ట్ లేజర్ స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం రూ. 45,000 బిల్లు చేసింది. అయితే ఆమె అంత బిల్లు చూసి షాక్ కాలేదు సరికదా.. సింపుల్‌గా QR కోడ్ స్కాన్ చేసి 6 నెలల EMI లోకి ఆ మొత్తాన్ని మార్చేసింది. అంతా అయిపోయాక ఇది షూలు కొనడం కంటే ఈజీగా ఉందని నవ్వేస్తూ వెళ్లిపోయింది. మరి ఇంతకీ ఆమెకు ఈ మొత్తం లోన్ గా ఎవరు ఇచ్చారంటే ఓ ఫిన్ టెక్ కంపెనీ.. Fibe (పూర్వం EarlySalary)యాప్ ద్వారా ఆమె ఈ మొత్తాన్ని తన అందానికి వాడుకుంది. ఇప్పుడు ప్రతి నెలా 3,000కి పైగా 'వెల్‌నెస్ లోన్స్' కట్టుకుంటోంది. సో ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్ అన్నమాట..

బ్యూటీ ఫిన్‌టెక్! అంటే మీ బటాక్స్, లిప్ ఫిల్లర్, గ్లో స్కిన్ ట్రీట్‌మెంట్స్ కోసం ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ లాంటి పెద్ద లెండర్లు లోన్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కొత్త ఫిన్‌టెక్ స్టార్టప్స్ (Fibe, QubeHealth, SaveIN) ఈ మార్కెట్‌ను రీక్రియేట్ చేస్తున్నాయి. VLCC, VCare, Olivia, Max Hair వంటి క్లినిక్స్‌తో కలిసి కొత్తగా EMI ఆఫర్లు ఇస్తున్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, బోటాక్స్, లిపోసక్షన్, స్కిన్ లైటెనింగ్ IV డ్రిప్స్... ఇవన్నీ ఇప్పుడు ఈఎమ్ఐతో అందుబాటులోకి వచ్చాయి.
అయితే విచిత్రకరమైన అంశం ఏంటంటే.. ఈ లోన్లు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే వాళ్లు ఈ లోన్లు తమ కోసం తీసుకుంటున్నారా..లేక తమ జీవిత భాగస్వామి కోసం తీసుకుంటున్నారా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. షాకింగ్ కర అంశం ఏంటంటే.. VLCC లో మాత్రమే Fibe ద్వారా లోన్ డిస్బర్సల్స్ రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్లకు 1 ఏళ్లలో పెరిగాయి. కేవలం బ్యూటీ కోసమే ఈ లోన్లను ఉఫయోగించారంటే ఈ ట్రెండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేకించి పెళ్లి కాబోయేవాళ్లు, 21 ఏళ్ల యువత, 30ల్లో ఉన్న మిలేనియల్స్ అందరూ.. EMI లోన్లపై స్కిన్, హెయిర్, డెంటల్, ఐవీఎఫ్, ఆయుర్వేద ట్రీట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. QubeHealth యూజర్లు సగటున రూ. 1.1 లక్షల వరకు ఖర్చుపెడుతున్నారు.ఇక SaveIN అనే స్టార్టప్ అయితే మరో ముందడుగు వేసి welUp అనే కార్పొరేట్ వెల్‌నెస్ ప్లాట్‌ఫాం కూడా తీసుకొచ్చింది. ఇందులో ఉద్యోగులు బ్యూటీ, మెంటల్ హెల్త్, ఆయుర్వేదం, డెంటల్, డైట్ ప్లాన్‌ల వరకు పొందొచ్చు.
IVF, డెంటల్, మెంటల్ హెల్త్, ట్రీట్మెంట్లు కూడా ఇప్పుడు వెల్‌నెస్ లోన్స్ కింద వస్తున్నాయి. SaveIN వంటి సంస్థలు ఉద్యోగులకు ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్లు, డైటింగ్, మెంటల్ హెల్త్ సపోర్ట్ వంటి సేవలు కూడా ఈ లోన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాయి. అన్నీ కూడా ఈఎంఐ ద్వారానే పొందే సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కంపెనీ. ఇప్పటివరకు 6 లక్షల అప్లికేషన్లు తీసుకుంది. వాటిలో 1.2 లక్షలు ఒక్క ఏడాదిలోనే తీసుకుంది. ఈ సంస్థకు 130 నగరాల్లో ఏడువేలకు పైగా క్లినిక్స్ ఉన్నాయి.
దీనిపై QubeHealth CEO క్రిస్ జార్జ్ మాట్లాడుతూ.. మా ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయితే లోన్ తీసుకునే వారు పురుషులే కాని.. ఉపయోగించే వారు వారి భార్యలు, కుటుంబ సభ్యులు కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి రూ. 65,000.. బ్యూటీ ప్యాకేజీలకు రూ. 30,000 నుంచి 1 లక్ష వరకు ఖర్చవుతోందని తెలిపారు. ఒక సాధారణ వినియోగదారు సంవత్సరానికి రూ. 1.1 లక్షలు ఈఎంఐల ద్వారా బ్యూటీకి ఖర్చుపెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఆఫర్.. పుణే, కోల్‌కతా, తమిళనాడు, కేరళ, తెలంగాణచ చండీగఢ్, లుధియానా, నాగ్‌పూర్, ఇండోర్ వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశంలో కాస్మెటిక్ సర్జరీ మార్కెట్ 2030 నాటికి రూ. 99,475 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా..ఇవాళ కొత్త ముక్కు కావాలంటే, ఈఎమ్ఐ పెట్టేసి పెట్టుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, "సౌందర్యం ఇప్పుడు లగ్జరీ కాదు, లైఫ్‌స్టైల్! ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. EMI మాయలో మోముని మెరిపించుకుంటున్నదే ట్రెండ్!
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications