Multibagger Stock: లక్షను రూ.18 లక్షలు చేసిన స్టాక్.. ఫోకస్‌లో ఉందిగా..
Multibagger Stock: మార్కెట్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న వేళ స్మాల్ క్యాప్ స్టాక్స్ పరుగులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మల్టీబ్యాగర్ రాబడులను ఇన్వెస్టర్లు ఆస్వాదిస్తున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మల్టీబ్యాగర్ స్టాక్ BCL ఇండస్ట్రీస్ గురించే. గత నెలలో స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ కారణంగా దాదాపు 18 శాతం మేర లాభపడింది. వంటనూనెల తయారీలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లు ఊహించని రిటర్న్స్ పొందారు.

బుధవారం మార్కెట్లు ముగిసే సమయంలో బీసీఎల్ ఇండస్ట్రీస్ 3.50 శాతం పెరిగి రూ.512గా నిలిచింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను గమనిస్తే రూ.534.50గా ఉంది. ఇదే క్రమంలో 52 వారాల కనిష్ఠ ధర రూ.278.65గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.1,240 కోట్లుగా ఉంది. స్టాక్ చివరగా జూన్ 20, 2023న రూ.536.35 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. స్మాల్ క్యాప్ స్టాక్ తన షేర్లను 1:10 నిష్పత్తిలో స్ప్లిట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఒక్కో షేరుపై అర్హులైన ఇన్వెస్టర్లకు రూ.5 డివిడెండ్ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది.

BCL ఇండస్ట్రీస్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరిగి FY22 అదే కాలంలో రూ. 22.85 కోట్ల నుంచి FY23 నాలుగో త్రైమాసికంలో రూ.24.31 కోట్లకు పెరిగింది. త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 9 శాతం వృద్ధితో రూ.457.19 కోట్లకు చేరుకున్నాయి. మూడేళ్ల కిందట కరోనా కాలంలో కనిష్ఠమైన రూ.29.5 స్థాయి నుంచి షేర్ ధర రూ.1,700 శాతం పెరిగి ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. అప్పట్లో కంపెనీ షేర్లలో ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి వాటిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.18 లక్షలుగా ఉండేది.
భారత్, దక్షిణాసియా ప్రాంతంలో ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేటెడ్ డిస్టిలరీ ఇథనాల్ ప్లాంట్‌ను కలిగి ఉన్న ఏకైక కంపెనీ BCL ఇండస్ట్రీస్.


Click it and Unblock the Notifications