క్రికెట్ అభిమానులకు ఇదొక ఊహించని చేదు వార్త అని చెప్పవచ్చు ! బహుశా... ఐపీల్ చరిత్రలోనే ఇలా ఎన్నడూ జరగలేదు కూడా. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ప్లేయర్స్ ఇంకా ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరి అని వెల్లడించింది. దింతో ఇకపై ఈరోజు నుండి ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండవు. మరోవైపు విదేశీ ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతుందని. అంతేకాక టోర్నమెంట్‌ను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది బీసీసీఐ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితులకి ముఖ్య కారణం ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి. ఏప్రిల్ 22న జరిగిన ఈ దుర్ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.
ఈ ఉద్రిక్తతల ప్రభావం ఐపీఎల్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. తొలుత విద్యుత్ అంతరాయం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిందని బీసీసీఐ ప్రకటించినప్పటికీ, యుద్ధం జరగనున్నట్లు సంకేతాలు రావడంతో మ్యాచ్ రద్దు చేసింది.
అయితే ఐపీఎల్ 18వ సీజన్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా టోర్నమెంట్ భవిష్యత్తుపై చర్చించడానికి బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. అందరి దృష్టి ఇప్పుడు బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే ఉంది. అభిమానులు మళ్లీ ఐపీల్ మ్యాచ్ ఎప్పుడు చూస్తారు అనేది వేచి చూడాలి!
ఐపీఎల్ మ్యాచ్ రద్దు స్పాన్సర్‌షిప్ ఇంకా మీడియా హక్కుల ఒప్పందాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాగే మ్యాచ్ రీషెడ్యూలింగ్ లేదా కాంపెన్సేషన్ కోసం స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా అండ్ స్పాన్సర్‌లతో BCCI చర్చలు జరపాల్సి ఉంటుంది. కేంద్రం అనుమతి లేకుండా ఐపీఎల్ కొనసాగించడం సాధ్యం కాదు. టోర్నమెంట్ రద్దు వరకు IPL 2025 లీగ్లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌లు జరిగాయి మరో 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అయితే, ఇంకా 12 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఐపీఎల్ కొత్త షెడ్యూల్‌ను వచ్చే వారం విడుదల కావవచ్చని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ప్రస్తుతం ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది కానీ ఇప్పుడు అవకాశాలు కష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్ స్థానంలో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications