BCCI Vs Byjus: బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన బైజూస్.. కానీ, ఎదురైన కొత్త సమస్య..
Byjus News: గడచిన ఏడాది నుంచి బీసీసీఐ- ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ మధ్య బకాయి చెల్లింపులకు సంబంధించిన ఒక వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒప్పందం లేనప్పటికీ చెల్లింపుల్లో కొంత భాగాన్ని ఆపటంపై బీసీసీఐ దివాలా ప్రక్రియ కోసం కోర్టుకు వెళ్లింది. దీంతో వివాదానికి పరిష్కారానికి బైజూస్ ముందుకు రాక తప్పలేదు.
వివరాల్లోకి వెళితే.. తమకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బైజూస్‌తో ఒక సెటిల్‌మెంట్‌కు చేరుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నేడు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT)కి తెలియజేసింది. వాస్తవానికి ఈ మెుత్తాన్ని రాబట్టేందుకే స్టార్టప్ కంపెనీని దివాలా ప్రక్రియ కోసం బీసీసీఐ కోర్టుకు లాగింది. ప్రస్తుతం ఒప్పుకున్న పరిష్కారంలో భాగంగా.. బైజు రవీంద్రన్ సోదరుడు రిజు రవీంద్రన్ నిన్న రూ.50 కోట్లు తమకు చెల్లించినట్లు బీసీసీఐ చెన్నై బ్రాంచ్ NCLATకి తెలిపింది. రేపు మరో రూ.25 కోట్లు, మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 8లోగా చెల్లించనున్నట్లు తెలిపింది.

అయితే ప్రస్తుతం బకాయిల చెల్లింపులపై కూడా వివాదం మెుదలైంది. యూఎస్ ఆధారిత ఆర్థిక రుణదాత బైజూస్ బకాయిలను తిరిగి చెల్లించడాన్ని వ్యతిరేకించింది. ఇది దొంగిలించబడిన డబ్బుతో నిధులు సమకూరుస్తున్నవిగా అప్పీలుకు తెలిపారు. రుణదాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ అమెరికా కోర్టు నిర్ధారించిన ప్రకారం రవీంద్రన్ సోదరులు రూ.500 కోట్లకు పైగా కంపెనీ నిధులను స్వాహా చేసేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల మధ్య బైజూ రవీంద్రన్ దుబాయ్‌కి పారిపోయాడని వాదనల్లో కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం బైజూల్ చేస్తున్న డబ్బు 553 మిలియన్ డాలర్లలో భాగమని చెప్పారు.
దీనిపై స్పందించిన బీసీసీఐ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే క్రికెట్ బోర్డు కళంకిత డబ్బును ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు. బీసీసీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా రుణదాతల ఆందోళనలు ఊహలపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. BCCIకి చెల్లిస్తున్న డబ్బు బైజూ రవీంద్రన్‌ది కాదని అండర్‌టేకింగ్‌ను ఫైల్ చేసేలా బైజూస్‌ను ఆదేశించాలని రుణదాతలు NCLATని కోరారు.
బైజూస్‌పై దివాలా ప్రక్రియను పర్యవేక్షించడానికి నియమించబడిన మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఎడ్టెక్ కంపెనీ ప్రక్రియకు సహకరించడం లేదని చెప్పారు. పదహారు రోజులైనప్పటికీ బైజూస్ ఇప్పటికీ తమకు ఎలాంటి యాక్సెస్ ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయని, తాను కేవలం రెండు ల్యాప్‌టాప్‌లను కనుగొనగలిగాను కానీ వాటిలో మొత్తం డేటా తొలగించబడిందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications