దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగర వాసులకు బీబీఎంపీ షాకిచ్చింది.వందలాది మంది ఇంటి యజమానులకు అనుకోని షోకాజ్ నోటీసులు పంపింది. బృహత్ బెంగళూరు మహానగరపాలిక (BBMP) అందిస్తున్న ఈ-ఖాటా వ్యవస్థలో తలెత్తిన చిన్న లోపం బెంగళూరులోని ఇంటి యజమానులకు చుక్కలు చూపించింది.
ఈ-ఖాటా అనేది ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన సమాచారం డిజిటల్‌గా నమోదు చేసుకునే వ్యవస్థ. ఇది నగరంలో జూలై 1, 2025 నుండి ఇంటి యజమానులకు తప్పనిసరి చేయబడింది. ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులు, యాజమాన్య ప్రమాణాలు, పరిమాణం వంటి వివరాలను యజమానులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో ముఖ్యమైన అంశం ఏంటంటే.. కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రస్తావించకపోవడమే యజమానులకు పెద్ద సమస్యగా మారింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం, బెంగళూరులోని అనేక మంది ఇంటి యజమానులు వారి ఇంటి పరిమాణాన్ని నమోదు చేసినప్పుడు.. అందులో కార్ పార్కింగ్ ఏరియాను ప్రస్తావించలేదు. దీన్ని BBMP కొత్త సాఫ్ట్‌వేర్ కావేరి సమస్యగా గుర్తించి ఆటోమేటిక్‌గా యజమానులకు షోకాజ్ నోటీసులు పంపించింది.
ఈ నోటీసులపై రిచ్‌మండ్ టౌన్‌కు చెందిన రజత్ రావు మాట్లాడుతూ.. తన అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ స్థలానికి పన్ను చెల్లించాల్సిందిగా నోటీసు వచ్చింది.అలాగే పార్కింగ్ ఏరియాను బీబీఎంపీ తనంతట తానే కొలతలు నిర్ణయించిందని.. ఎలాంటి పత్రాలు పరిశీలించకుండా లేదా ప్రత్యక్షంగా తనిఖీ చేయకుండా ఈ నోటీసులు వచ్చాయని ఆరోపించారు.
BBMP అధికారులు ఈ నోటీసులపై క్లారిటీ ఇచ్చారు. వారి కావేరి సాఫ్ట్‌వేర్ ఈ-ఖాటా, EPID (ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్) డేటాబేస్ మధ్య ఏవైనా విభిన్నతలు ఉంటే, వాటిని నేరుగా గుర్తించేలా రూపొందించారు. అయితే NIC (నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్) ద్వారా అభివృద్ధి చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన చిన్న సమస్య వల్ల, 5 శాతం కన్నా తక్కువ వ్యత్యాసం ఉన్నా కూడా నోటీసులు వెళ్లాయని తెలిపారు.
ఈ అంశంపై బెంగళూరులోని శాంతినగర్, యలహంక, ఇతర ప్రాంతాల నివాసితులు బీబీఎంపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యలహంకకు చెందిన విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "నేను ఏ తప్పూ చేయలేదు, అయినా నేను అప్పీల్ చేయాలని బీబీఎంపీ అధికారి చెప్పారు. ఇది మరొక మోసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సుధీంద్ర హాలప్ప గౌడ మాట్లాడుతూ.. మేము మధ్యతరగతి ప్రజలు ఎందుకు ఈ విధంగా వేధింపులకు గురవుతున్నాం? పన్ను చెల్లించని అధికారుల సంగతి ఏమిటని నిలదీశారు.
BBMP స్పెషల్ కమిషనర్ (రెవెన్యూ) మునీష్ మౌద్గిల్ మాట్లాడుతూ.. 5 శాతం కన్నా ఎక్కువ వ్యత్యాసం ఉన్న వివరాలకే నోటీసులు ఇవ్వాలని మేము ఉద్దేశించాం. కానీ సాంకేతిక లోపం వల్ల తక్కువ డిఫరెన్స్ ఉన్నవారికీ నోటీసులు వెళ్ళాయి. ఈమెయిల్‌లు మాస్‌గా పంపారు. ఇది సరిచేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలు తమ ఈ-ఖాటాలో తప్పు డేటా ఇస్తే మేము బాధ్యత వహించలేమన్నారు. సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications