Multibagger: 111 శాతం పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్.. మరో 30 శాతం రిటర్న్స్‌కు ఛాన్స్.. మీ దగ్గర ఉందా?
High returns: ఎలక్ట్రిఫికేషన్ దిశగా వాహనాలన్నీ శరవేగంగా మారుతున్నాయి. ఈ సమయంలో బ్యాటరీల తయారీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ విభాగంలో ఉన్న ఆయా కంపెనీల షేర్లు మంచి దూకుడు మీద ఉన్నాయి. భారీ రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే నూరు శాతం రాబడి ఇచ్చిన ఓ సంస్థ.. రానున్న రోజుల్లో మరింత మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు రానున్న రోజుల్లో గణనీయంగా పెరగవచ్చని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. బ్యాటరీ సెల్ స్థానికీకరణలో ఆ సంస్థ అగ్రగామిగా మారుతుందని అభిప్రాయపడింది. కంపెనీ షేర్ల ధరలు 30 శాతం పెరగవచ్చని టార్గెట్ ఇచ్చింది. ప్రస్తుతం 370-400 వద్ద కొనసాగుతున్న షేర్ ధర భవిష్యత్తులో 485-500 వరకు పెరగవచ్చని పేర్కొంది.

ఎక్సైడ్ స్టాక్ ఈ ఏడాది ఫోకస్‌లో ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బెంచ్‌మార్క్ సెన్సెక్స్‌తో కేవలం 2.7 శాతం పెరగ్గా.. బ్యాటరీ మేకర్ 23 శాతం మేర రాబడిని ఇచ్చింది. కాగా గతేడాదిలో సెన్సెక్స్ 24 శాతం పైకి ఎగబాకింది. అదే సమయంలో ఎక్సైడ్ తన ఇన్వెస్టర్లను ఏకంగా 111 శాతం సంపన్నులను చేసింది.
'మేడ్ ఇన్ ఇండియా', ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం మద్దతు, బలమైన ఆటో మరియు పారిశ్రామిక కస్టమర్ & టెక్ టై-అప్‌లు అన్నీ కలిసి బ్యాటరీ తయారీదారుకి అనుకూలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. 2030 నాటికి భారతదేశ లిథియం బ్యాటరీ మార్కెట్ 13 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అందుకే EV బ్యాటరీ స్థానికీకరణ కోసం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థతో దక్షిణ కొరియా ఆటో మేజర్లు కియా మరియు హ్యుందాయ్ మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గుర్తుచేసింది.


Click it and Unblock the Notifications