Bata-Adidas: దేశంలో పాదరక్షల వ్యాపారంలో ఉన్న బాటా కంపెనీ చాలా మందికి తెలుసు. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు శ్రేణిలో చెప్పులు, బూట్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటికి అధికంగా ప్రజాధరణ సైతం ఉంది.
అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది ఇండియన్ కంపెనీ కాదు. చెకోస్లోవేకియాలో 1894లో స్థాపించబడిన కుటుంబ యాజమాన్య వ్యాపారం. టోమస్ బాటా అనే వ్యక్తి దీనిని కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అయితే నాణ్యత కలిగిన తోలు పాదరక్షణ విక్రయంతో కంపెనీ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పాదరక్షల తయారీదారు బాటా ఇండియా.. భారతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ అడిడాస్‌తో భాగస్వామ్య చర్చలు జరుపుతోంది.

అడిడాస్‌తో బాటా సంభావ్య భాగస్వామ్యం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో కంపెనీ షేర్ గణనీయమైన ర్యాలీని నమోదు చేసింది. ఇంట్రాడేలో 5.58 శాతానికి పైగా పెరిగి బాటా స్టాక్ రూ.1,739 వద్ద ట్రేడవుతోంది. వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా బాటా భారతీయ మార్కెట్లో క్యాజువల్ వేర్ దుస్తులకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ అందుకోవటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఆదాయ వృద్ధి నెమ్మదించటం, అధిక ఇన్వెంటరీలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది.
ఇది బాటా పోటీ వైఖరిని పెంచుతుందని కంపెనీ భావిస్తోంది. రిఫ్రెష్ చేసిన పోర్ట్‌ఫోలియోలతో ప్రీమియం ధర పాయింట్ల విభాగంలోకి మళ్లీ ప్రవేశించాలని యోచిస్తోంది. ఆఫ్‌లైన్ విక్రయాల వృద్ధికి కృషి చేస్తూనే.. డిజిటల్ యూజర్లకు, యువతకు కనెక్ట్ అవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాంచైజీ మోడల్ కింద FY24లో మరో 125 స్టోర్‌లను పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడైంది. Q1FY24లో కంపెనీ లాభం 10 శాతం తగ్గి రూ.119.3 కోట్లుగా నిలిచింది.
మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలతో పోటీని తట్టుకునేందుకు కంపెనీ కొత్త మోడళ్లను వేగంగా లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో బాటా ఇండియా ఫ్రంట్-ఎండ్ కార్యకలాపాలు, దుకాణాలు, బ్యాక్-ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, డిజైన్, R&Dలో పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాటాకు 2100 స్టోర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications