Bata India: వాస్తవానికి పూర్వ కాలంలో నచ్చిన వస్తువులు కొనుక్కోవాలంటే అవి దొరికే షాపులకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మందికి ఇందుకోసం సమీప నగరాలకు వెళ్లి కొనాల్సి వచ్చేది. దీనికి పరిష్కారంగా కొన్ని రోజుల్లో ఇంటికి వాటిని తెప్పించుకునేందుకు ఈకామర్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు తమ కోసం కూడా తాము సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. ఇలా అనుకోగానే అలా నిమిషాల్లో ప్రజలు తమకు నచ్చినవి కాళ్ల దగ్గరకే రావాలని కోరుకుంటున్నారు. ఇది దేశంలో క్విక్ కామర్స్ వ్యాపారానికి పెద్ద అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, పండ్లు, సరుకులు వంటి వాటిని అనేక కంపెనీలు 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇందులో కొత్త సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

బాటా ఇండియా ప్లాన్..
ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఫుట్‌వేర్ సంస్థ బాటా ఇండియా 10 నిమిషాల్లో వినియోగదారులకు పాదరక్షల డెలివరీని ప్రారంభించాలని చూస్తోంది. దీనికోసం రెండు క్విక్ కామర్స్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం బాటా స్టోర్‌లలో అందుబాటులో లేని వస్తువుల కోసం 72-గంటల డెలివరీ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ప్లాన్ ప్రకారం క్విక్ డెలివరీలను సమర్ధవంతంగా నిర్వహించడానికి డార్క్ స్టోర్‌లలో ఇన్వెంటరీని ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ పెద్ద వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.944 కోట్లుగా నిలిచింది.
10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ..
బెంగళూరుకు చెందిన స్విష్ అనే స్టార్టప్ 10 నిమిషాల్లో ఆహారాన్ని అందిస్తామని ప్రకటించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న స్విష్.. పది నిమిషాల్లో తమకు ఇష్టమైన ఆహారాన్ని వినియోగదారులకు అందజేస్తామని ప్రకటించింది. చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఉజ్వల్ సుకేజా అంటున్నారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీకి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొంతమంది వినియోగదారులు మాత్రం 10 నిమిషాల డెలివరీ డెలివరీ వర్కర్లపై చాలా ఒత్తిడిని పెంచుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications