IPO News: చిన్న ఐపీవో కోసం ఎగబడుతున్న జనం.. గ్రేమార్కెట్లో దిమ్మతిరిగే రేటు.. వామ్మో..
IPO News: ప్రస్తుతం మార్కెట్లో ఐపీవోలకు క్రేజ్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో కనిపిస్తోంది. చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ప్రతి ఐపీవోకూ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు గ్రేమార్కెట్లో సునామీ సృష్టిస్తున్నాయి.
ఇప్పుడు మనం బేసిలిక్ ప్లై స్టూడియో ఐపీవో గురించే తెలుసుకోబోతున్నాము. ఈ చిన్న కంపెనీ మార్కెట్ల నుంచి కేవలం రూ.66 కోట్లను సమీకరించాలని ఐపీవోను ప్రారంభించింది. కానీ ఐపీవో 355 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కంపెనీకి కావాల్సింది రూ.66 కోట్లైతే.. దీనికోసం రూ.10,000 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.

Basilik Fly Studio అనే కంపెనీ చెన్నైలో ఉన్న ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో. దీనికి మనదేశంతో పాటు కెనడా, యూకేలో సైతం అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీ ఎండ్‌గేమ్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, టాప్ గన్: మావెరిక్ వంటి అనేక హాలీవుడ్ చిత్రాలకు పనిచేసింది. ఐపీవో రిటైల్ కోటా 409.12 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII) కోటా 549.07 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 116.34 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ రూ.92-97గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.280 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంటే ఈ లెక్కన లిస్టింగ్ రోజున స్టాక్ ధర రూ.377గా ఉండొచ్చని తెలుస్తోంది. అంటే పెట్టుబడిదారులు లిస్టింగ్ రోజున 288% లాభాన్ని పొందగలరు. ఐపీవో షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 8, 2023న ఖరారు కావచ్చు. అలాగే సెప్టెంబర్ 13న ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయవచ్చు. కంపెనీ షేర్లు NSE SME ప్లాట్‌ఫారమ్‌లో జాబితా చేయబడతాయి.


Click it and Unblock the Notifications