IPO News: గ్రేమార్కెట్లో దుమ్మురేపుతున్న ఐపీవో.. షేర్లు వచ్చినోళ్లకి పండగే.. అప్లై చేశారా..??
IPO News: ఇటీవల మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలు లిస్టింగ్ రోజునే సంచలన లాభాలను అందిస్తూ ఇన్వెస్టర్లపై డబ్బుల తుఫాన్ కురిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఐపీవో మార్కెట్లోకి రావటానికి ముందరే సంచలనాలు సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే బేసిలిక్ ఫ్లై స్టూడియో ఐపీవో సెప్టెంబర్ 1 నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. మెుదటి రోజునే ఈ కంపెనీ ఐపీవోకు మార్కెట్లో బలమైన స్పందన కనిపించింది. దీంతో గ్రేమార్కెట్లో కంపెనీ స్టాక్ 225 శాతం కంటే ఎక్కువ ప్రీమియం ధరతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే కంపెనీ ఐపీవో సెప్టెంబరు 5, 2023 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది.

బాసిలిక్ ఫ్లై స్టూడియో ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.92-97గా కంపెనీ ప్రకటించింది. అయితే గ్రేమార్కెట్లో మాత్రం కంపెనీ షేర్లకు అధిక గిరాకీ కారణంగా రూ.220 ప్రీమియం ధర పలుకుతోంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవో ద్వారా షేర్లను పొందితే లిస్టింగ్ రోజున మార్కెట్లో దాని రేటు రూ.317 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇన్వెస్టర్ల డబ్బు లిస్టింగ్ రోజున మూడింతలుగా మారిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ షేర్లు సెప్టెంబర్ 13న లిస్ట్ కానున్నాయి. Basilic Fly Studio ఐపీవో షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 8న ఫైనల్ కానుంది. రిటైల్ పెట్టుబడిదారులు కంపెనీ IPOలో కనీసం ఒక లాట్ షేర్లను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఒక్కో లాటుకు 1200 షేర్లను ఉంచగా.. ఇన్వెస్టర్లు ఇందుకోసం కనీసం రూ.1,16,400 వెచ్చించాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు NSE SME ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేయబడతాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications