బషర్ అల్-అస్సాద్ సిరియాలో ఇస్లామిక్ తిరుగుబాటుదారుల చేతిలో ఓడిపోయి చివరికి తన రాజ్యాన్ని మాత్రమే కాకుండా దేశాన్ని కూడా విడిచి పెట్టి పారిపోయాడు. 13 సంవత్సరాల సిలిల్ వార్ తర్వాత తిరుగుబాటుదారులు ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (HTS) నాయకత్వంలో అసద్ ప్రభుత్వం చివరకు పడిపోయింది.
ఈ యుద్ధం సమయంలో అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బషర్ అల్-అస్సాద్ తన కాన్వాయ్‌తో ఇప్పుడు రష్యాలో ఉన్నట్లు సమాచారం. దేశం విడిచి పారిపోయి పరారీలో ఉన్న అస్సాద్ భారీ సంపదకు యజమాని ఇంకా వందల టన్నుల బంగారంతో పాటు భారీగా US డాలర్లు, యూరోలు ఉన్నాయి. బషర్ అల్-అస్సాద్ మొత్తం సంపద విలువ గురించి తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే.

2011లో మొదలైన సివిల్ వార్, 13 ఏళ్ల తర్వాత తిరుగుబాటు
సిరియాలో ఈ సివిల్ వార్ నేపథ్యంలో బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది, అసద్ విమానం సిరియాలోని లటాకియా నుండి బయలుదేరి మాస్కో చేరుకున్నట్లు ఫ్లైట్ ట్రాకర్ నుండి సమాచారం అందింది. ఫ్లైట్‌రాడార్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, ఆదివారం (డిసెంబర్ 8) రష్యా సైనిక విమానం లటాకియా నుండి బయలుదేరి మాస్కోకు చేరుకుంది అయితే ఈ ఫ్లయిట్ అస్సాద్‌కు చెందినదని భావిస్తున్నారు.
2011లో సిరియాలో ప్రారంభన తిరుగుబాటు
అసద్ ప్రభుత్వం ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను క్రూరంగా అణిచివేసింది. ఈ వివాదం క్రమంగా సిలిల్ వార్ల మారింది, దింతో చాలా తిరుగుబాటు గ్రూపులు అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచాయి. చివరికి ఈ 13 సంవత్సరాల యుద్ధం అసద్ పాలనను పడగొట్టింది. డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా తిరుగుబాటు గ్రూపులు అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కాకుండా సిరియా ప్రజలకు కొత్త ప్రారంభానికి అవకాశం కల్పించాయి.
200 టన్నుల బంగారం నిల్వలు!
నివేదికలు నిజమైతే దేశం నుండి పారిపోయిన అసద్ దగ్గర భారీ సంపద ఉందని అతను తనతో పాటు కిలోల కొద్దీ బంగారం, డబ్బును తీసుకెళ్లి ఉండొచ్చు. సౌదీ వార్తాపత్రిక ఐలావ్ ప్రకారం ఒకవైపు దేశంలోని 90 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతుండగా మరోవైపు అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ కుటుంబం అత్యంత ధనవంతులు. ఎలావ్ నివేదికలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ MI6 నుండి సమాచారం ప్రకారం గత సంవత్సరం 2023 నాటికి ప్రెసిడెంట్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ బిలియన్ డాలర్లు ఇంకా యూరోలలో కూడా ఉందని, ఇందులో దాదాపు 200 టన్నుల బంగారం ఉందని కూడా చెబుతున్నారు.

ఎలావ్ రిపోర్ట్ ప్రకారం
200 టన్నుల బంగారం నిల్వలు కాకుండా అధ్యక్షుడు అసద్ ఆస్తుల విలువ 16 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు), 5 బిలియన్ యూరోలు (దాదాపు రూ. 44,594 కోట్లు). ఇది కాకుండా అధ్యక్షుడు అసద్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన & విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది, ఇవి ప్రతిరోజూ అతని కాన్వాయ్‌లో కనిపిస్తాయి. అతని కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఆస్టన్ మార్టిన్ DB7 నుండి ఫెరారీ F40, ఫెరారీ F430, మెర్సిడెస్ బెంజ్, ఆడి వరకు కార్లు ఉన్నాయి.
విశేషమేమిటంటే సౌదీ వార్తాపత్రిక ఐలావ్ నివేదికలో బసర్ అల్-అస్సాద్ మొత్తం ఆస్తులు సిరియా బడ్జెట్‌తో సుమారు 7 సంవత్సరాలకు సమానం అని అంచనా. అయితే ఇందులో ఎంత ఆస్తి లేదా బంగారం, డాలర్లు లేదా యూరోలతో అసద్ దేశం విడిచి పారిపోయాడన్న దానిపై స్పష్టత లేదు.
మాదకద్రవ్యాల వ్యాపారం నుండి బిలియన్ల సంపాదన
నివేదికల ప్రకారం బషర్ అల్-అస్సాద్ దగ్గర సిరియాలో భారీగా మాదకద్రవ్యాల నిల్వ ఉంది, దీని వల్లనే అస్సాద్ ప్రభుత్వం బిలియన్ల డాలర్లను సంపాదించింది. ఈ డ్రగ్ పేరు 'Captagon', ప్రపంచంలోని దాని ఉత్పత్తిలో 80% సిరియాలో మాత్రమే ఉందని చాలా నివేదికలలో పేర్కొన్నారు. సిరియా కూడా దీన్ని అత్యధికంగా ఎగుమతి చేస్తుంది అలాగే ఇజ్రాయెల్ వెబ్‌సైట్ వియానెట్ ప్రకారం, అసద్ ప్రభుత్వం దీని ద్వారా సంవత్సరానికి 5 బిలియన్ డాలర్లు సంపాదించేదట. క్యాప్టగాన్ ద్వారా అసద్ కుటుంబానికే కాకుండా సిరియాలోని టాప్ ఆర్మీ అధికారులు కూడా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications