ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా త్వరలోనే దేశంలోని కీలక శాస్త్రీయ కేంద్రాల్లో ఒకటిగా మారనుంది. భారతదేశపు ప్రముఖ అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ఇక్కడ సుమారు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశోధన, అభివృద్ధి (R&D) క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక కార్యక్రమంగా భావించబడుతోంది.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ క్యాంపస్ కోసం 148.15 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు బార్క్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అధికారికంగా సంప్రదించింది. ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల అంచనా కమిటీ (EAC) ఈ నెల ప్రారంభంలో పరిశీలించి, అటవీ భూమి మళ్లింపుకు సూత్రప్రాయంగా ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది.

EAC సమావేశంలో జరిగిన వివరాల ప్రకారం వ్యూహాత్మక కారణాల రీత్యా విశాఖపట్నం సమీపంలోని తూర్పు తీర ప్రాంతంలో ఈ కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సైట్ సెలెక్షన్ కమిటీ సిఫార్సులు, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆమోదం మేరకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 1,200 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమి (సుమారు 3 వేల ఎకరాలు) స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అటవీ భూమి మళ్లింపుకు ప్రతిపాదించిన ప్రాంతం ఈ రెవెన్యూ భూమికి ఆనుకొని ఉండగా, ప్రాజెక్ట్ స్థలం, సముద్రం మధ్యలో ఈ అటవీ ప్రాంతం ఉన్నట్లు EAC వివరించింది.
ఈ కేంద్రం వ్యూహాత్మక ముందడుగు కావడంతో..దీనికి సంబంధించి వివరమైన ప్రాజెక్ట్ నివేదికను (DPR) బహిర్గతం చేయడం నుంచి మినహాయింపు పొందింది. అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ క్యాంపస్‌లో చుట్టూ భద్రతా కాంపౌండ్ వాల్, జోనల్ సెక్యూరిటీ ఫెన్సింగ్, పెట్రోలింగ్ రోడ్లు, వాచ్ టవర్లు, పంప్ హౌసులు, డ్రెయిన్లు, సర్వీస్ లైన్లు, ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
పర్యావరణ ప్రభావాల విషయానికి వస్తే.. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఉన్న 21,244 చెట్లలో 1,722 చెట్లను మాత్రమే తొలగించాల్సి ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని చెట్లను నరికివేయబోమని, తద్వారా స్థానిక పర్యావరణ వ్యవస్థపై గణనీయమైన ప్రభావం ఉండదని EAC స్పష్టం చేసింది. ఈ అణు పరిశోధనా కేంద్రం ద్వారా ఇంధన భద్రత, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలక రంగాల్లో అణు సాంకేతిక అనువర్తనాలపై పరిశోధనలు చేపడతారు. ఇవి దేశ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు దోహదపడతాయని EAC అభిప్రాయపడింది.
అదే సమయంలో, మళ్లించబడిన అటవీ భూమిని భవిష్యత్తులో సైట్-నిర్దిష్టం కాని కార్యకలాపాలకు ఉపయోగించరాదని స్పష్టమైన నిబంధనను విధిస్తూ, ప్రతిపాదనకు ఆమోదం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఏదేమైనా అనకాపల్లిలో ప్రతిపాదిత బార్క్ ఆర్ అండ్ డీ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా, దేశానికి కూడా అణు శాస్త్ర పరిశోధనలో కీలక మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications