రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిప్యూటీ గవర్నర్ టి రబిశంకర్ క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటు క్రిప్టో కరెన్సీలను నిషేధించడమే దేశానికి ఉత్తమమైన విధానమని అన్నారు. ఆయన ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ కార్యక్రమంలో సోమవారం మాట్లాడారు. 20వ శతాబ్దం కంటే ప్రారంభంలో పోంజీ స్కామ్స్ కంటే కూడా క్రిప్టో దారుణమని అభిప్రాయపడ్డారు. ఆదాయాన్ని ఆర్జించే ఆస్తులపై పెట్టుబడి పెట్టిన పోంజీ ప్లాన్స్, క్రిప్టో కంటే మెరుగ్గా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి క్రిప్టో కరెన్సీలు ముప్పు అన్నారు. క్రిప్టో కరెన్సీలను ఆర్బీఐ వ్యతిరేకిస్తున్నప్పటికీ సెంట్రల్ బ్యాంకు స్థాయిలో ఒక ఉన్నతాధికారి నిషేధించాలని వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. ఆర్థిక వ్యవస్థలోని నియంత్రణలన్నింటినీ బైపాస్ చేసేందుకే వాటిని రూపొందించారన్నారు. క్రిప్టోకు అనుమతిస్తే అవి కరెన్సీ, ద్రవ్య, బ్యాంకింగ్ వ్యవస్థలను అన్నింటిని కుప్పకూల్చుతాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే క్రిప్టోలను నిషేధించడమే సరైన చర్య అన్నారు.

జనవరి మాసంలో ఆహార వస్తువుల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 6.01 శాతానికి పెరిగింది. ఇది 7 నెలల గరిష్ఠం. డిసెంబర్ నెలలో ఇది 4.06 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌తో పోలిస్తే 4.05 శాతం నుండి 5.43 శాతానికి పెరిగింది. ఇక హోల్ సేల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 12.96 శాతానికి తగ్గింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications