For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Holidays October 2022: అక్టోబరులో 21 రోజులు బ్యాంకులు బంద్.. ముందుగా జాగ్రత్తపడండి..

|

Bank Holidays October 2022: ప్రస్తుతం ప్రతి చిన్న చెల్లింపులకూ డిజిటల్ మార్గాలను వినియోగించటం వల్ల బ్యాంకులతో సగటు మనిషికి సంబంధం పెరిగింది. ఈ క్రమంలో అనేక లావాదేవీలు చేసేందుకు వాటితో తప్పక పనిపడుతోంది. అయితే అక్టోబర్ నెలలో బ్యాంకులు అత్యధికంగా 21 రోజులు అందుబాటులో ఉండవు. వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుని పనులను ముందుగానే పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోండి.

హాలిడే మంత్..

హాలిడే మంత్..

అక్టోబర్‌లో హాలిడే సీజన్ ప్రారంభమైనందున.. ఈ నెలలో 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో శని, ఆదివారాలు కూడా కలిపి ఉంటాయి. ఏఏ రాష్ట్రాల్లో బ్యాంకులు ఏఏ రోజుల్లో అందుబాటులో ఉండవో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ విడుదల చేసింది.

సెలవులను ఎవరు నిర్ణయిస్తారు..

సెలవులను ఎవరు నిర్ణయిస్తారు..

వేరు వేరు రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులను అక్కడి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. మిగిలిన వాటిని రిజర్వు బ్యాంక్ నిర్ణయిస్తుంది. అందువల్ల వినియోగదారులు తమ సంబంధిత శాఖలను సందర్శించే ముందు సెలవుల జాబితాను తనిఖీ చేసుకోవటం ఉత్తమం. జాబితాలోని కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకమైనవి.

పండుగల సీజన్ కారణంగా..

పండుగల సీజన్ కారణంగా..

అక్టోబర్ నెలలో 21 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మొదటి సెలవుదినం అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి ఇవి ప్రారంభమవుతున్నాయి. దుర్గాపూజ, దసరా లేదా విజయదశమి వంటి ఇతర సెలవులు అక్టోబర్ 5, 2022న ఉన్నాయి. దీపావళి అక్టోబర్ 24న వస్తుంది. ఈ సెలవుదినం కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని బ్యాంకులు పాటిస్తున్నాయి.

అక్టోబరులో బ్యాంక్ సెలవుల లిస్ట్..

అక్టోబరులో బ్యాంక్ సెలవుల లిస్ట్..

అక్టోబరు 1 - బ్యాంకు ఖాతాల అర్ధ సంవత్సర ముగింపు

అక్టోబర్ 2 - ఆదివారం & గాంధీ జయంతి సెలవు

అక్టోబర్ 3 - దుర్గా పూజ (మహా అష్టమి)

అక్టోబర్ 4 - దుర్గాపూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం

అక్టోబర్ 5 - దుర్గాపూజ/దసరా (విజయ దశమి)/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం

అక్టోబర్ 6 - దుర్గా పూజ

అక్టోబర్ 7 - దుర్గా పూజ

అక్టోబర్ 8 - రెండవ శనివారం సెలవు, మిలాద్-ఇ-షెరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం)

అక్టోబర్ 9 - ఆదివారం

అక్టోబర్ 13 - కర్వా చౌత్

అక్టోబర్ 14 - ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ

అక్టోబర్ 16 - ఆదివారం

అక్టోబర్ 18 - కటి బిహు

అక్టోబర్ 22 - నాల్గవ శనివారం

అక్టోబర్ 23 - ఆదివారం

అక్టోబర్ 24 - కాళీ పూజ/దీపావళి/దీపావళి (లక్ష్మీ పూజ)/నరక చతుర్దశి)

అక్టోబర్ 25 - లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ

అక్టోబరు 26 - గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవంత్ కొత్త సంవత్సరం రోజు/భాయ్ బిజ్/భాయ్ దుజ్/దీపావళి (బలి ప్రతిపద)/లక్ష్మీ పూజ

అక్టోబర్ 27 - భైదూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబా

అక్టోబర్ 30 - ఆదివారం

అక్టోబర్ 31 - సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పుట్టినరోజు

ఆన్‌లైన్ సేవలు అందుబాటులో..

ఆన్‌లైన్ సేవలు అందుబాటులో..

21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినప్పటికీ.. ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెలవుల సమయంలో కస్టమర్‌లు భౌతికంగా బ్యాంక్ లో డిపాజిట్, విత్‌డ్రా లను చేయలేరు. ఈ సమయంలో క్యాష్ రీసైక్లర్లను వినియోగదారులు ఉపయోగించుకుని తమ లావాదేవీలను పూర్తిచేసుకునేందుకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. అయితే తప్పక బ్యాంక్ కు వెళ్లి చేసుకోవలన పనులు ఏవైనా ఉన్నట్లయితే సెలవులను పరిగణలోకి తీసుకుని పూర్తి చేసుకోవటం ఉత్తమం.

Read more about: bank holidays banks business news
English summary

Bank Holidays October 2022: అక్టోబరులో 21 రోజులు బ్యాంకులు బంద్.. ముందుగా జాగ్రత్తపడండి.. | banks will stay close for 21 days in October 2022 as per rbi banks holiday calender

banks will stay close for 21 days in October 2022 as per rbi banks holiday calender
Story first published: Friday, September 30, 2022, 9:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X