మే నెల ముగిసి జూన్ నెల మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే జూన్ నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే మీ నగరంలో బ్యాంకులు ఎప్పుడు, ఎందుకు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్ట్ ప్రకారం, జూన్ నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. బ్యాంకులు మూసివేసినప్పటికీ మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సక్షన్స్ చేయవచ్చు, ఏటీఎంల ద్వారా కూడా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

జూన్లో బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదిగో :
* 1 జూన్ 2025 (ఆదివారం): వీకెండ్ హాలిడే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్.
* 6 జూన్ 2025 (శుక్రవారం): ఈద్ ఉల్ అధా (బక్రీద్) సందర్భంగా తిరువనంతపురం ఇంకా కొచ్చిలో బ్యాంకులకు సెలవు.
* 7 జూన్ 2025 (శనివారం): బక్రీద్ ఈద్ ఉల్ జుహా సందర్భంగా దేశంలోని చాల రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, భోపాల్, హైదరాబాద్, భువనేశ్వర్, తెలంగాణ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, ఇంఫాల్, చండీగఢ్, జైపూర్, చెన్నై, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, డెహ్రాడూన్, ముంబై, నాగ్‌పూర్, గువహటి, న్యూఢిల్లీ, సిమ్లా, శ్రీనగర్, రాంచీ ఇంకా షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
* 8 జూన్ 2025 (ఆదివారం): వీకెండ్ హాలిడే కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు బంద్.
* 10 జూన్ 2025 (మంగళవారం): శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్‌లో బ్యాంకులు బంద్.
* 11 జూన్ 2025 (బుధవారం): సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా గ్యాంగ్‌టక్ ఇంకా సిమ్లాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
* 14 జూన్ 2025 (శనివారం): నెలలో రెండవ శనివారం. కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులు బంద్.
* 15 జూన్ 2025 (ఆదివారం): వీకెండ్ హాలిడే. అన్ని బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
* 22 జూన్ 2025 (ఆదివారం): వీకెండ్ హాలిడే కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* 27 జూన్ 2025 (శుక్రవారం): రథయాత్ర/కాంగ్ రథయాత్ర సందర్భంగా ఇంఫాల్ అలాగే భువనేశ్వర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
* 28 జూన్ 2025 (శనివారం): నెలలో నాల్గవ శనివారం సందర్భంగా అన్ని బ్యాంకులు బంద్.
* 29 జూన్ 2025 (ఆదివారం): వీకెండ్ హాలిడే కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* 30 జూన్ 2025 (సోమవారం): ఐజ్వాల్‌లో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
మీరు జూన్‌లో బ్యాంకుకు వెళ్లే ముందు పైన పేర్కొన్న లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ హాలిడేస్ రాష్ట్రాలు ఇంకా ప్రాంతీయ పండుగల ప్రాధాన్యత ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications