ఇప్పుడు ఈజీగా గుర్తుపట్టొచ్చు.. ఆర్బీఐ కొత్త నిర్ణయం.. ఫేక్ లేదా ఫ్రాడ్ కాల్స్ కట్..
ఫ్రాడ్ లేదా స్పామ్ కాల్స్ ఈ రోజుల్లో చాల మందికి విసుగుతెప్పిస్తున్నాయి. మొబైల్ యూజర్లు ఎక్కువగా స్పామ్ కాల్స్ తో ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్స్ ద్వారా స్కామ్‌లు, మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. చాలా మందికి బ్యాంకుల నుండి కాల్స్ చేస్తూన్నామని చెప్తూ వివరాలు సేకరించి మోసాలు చేస్తుంటారు. పెరుగుతున్న ఈ ఆందోళనలను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది.
ఆర్‌బిఐ ఆర్థిక సంస్థలు కస్టమర్‌లకు ట్రాన్సక్షన్స్ అండ్ మార్కెటింగ్ కాల్స్ చేసేటప్పుడు రెండు ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్‌లను ప్రవేశపెట్టింది. ఈ చర్య మొబైల్ యూజర్లను బ్యాంకింగ్ మోసాల కాల్స్ నుండి రక్షించడానికి, చట్టబద్ధమైన కమ్యూనికేషన్‌లపై నమ్మకాన్ని పెంచడానికి లక్ష్యంగా తీసుకొచ్చింది.

తాజా RBI నోటీసు ప్రకారం ట్రాన్సక్షన్స్ సంబంధించిన అన్ని కాల్స్ కోసం బ్యాంకులు ఇప్పుడు 1600తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ట్రాన్సక్షన్స్ లేదా డబ్బుల విషయానికి సంబంధించి ఏదైనా చట్టబద్ధమైన కాల్స్ 1600 నంబర్‌తో స్టార్ట్ అవుతాయి. ఈ నంబర్ సిరీస్ ద్వారా కస్టమర్లు ఈజీగా ఫ్రాడ్ కాల్స్ గుర్తించడంలో ఇంకా స్పామ్ కాల్స్ స్కామ్ నివారిండానికి సహాయపడుతుంది.
అదేవిధంగా మార్కెటింగ్ కాల్స్, SMSల కోసం RBI రెండు కొత్త నంబర్ సిరీస్లను కేటాయించింది. 1600తో ప్రారంభమయ్యే నంబర్‌లు బ్యాంకింగ్ సేవల నుండి ట్రాన్సక్షన్స్ సంబంధించిన కమ్యూనికేషన్‌ల కోసం ఉపయోగిస్తాయి, అయితే 140తో ప్రారంభమయ్యే నంబర్‌లు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లేదా ఇన్సూరెన్స్ వంటి సేవలను అందించే ప్రమోషనల్ కాల్‌లు అండ్ SMS నోటిఫికేషన్‌ల కోసం ఉపయోగిస్తాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్యువల్ రిపోర్ట్ ప్రకారం 2020 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాలను సంబంధించి దాదాపు 8703 కేసులు నమోదయ్యాయి. అయితే 2021 ఆర్ధిక సంవత్సరంలో 7338 తగ్గాయి. 2022 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాలు 9046 చేరాయి. అయితే 2024లో అత్యధికంగా 36073 బ్యాంకింగ్ మోసాలు జరిగాయి.
దింతో ఇప్పుడు ఈ సిరీస్ నంబర్లు బ్యాంకింగ్ కోసం ఉపయోగించబడతాయి కాబట్టి కస్టమర్లు ఇక ఫ్రాడ్ లేదా స్పామ్ కాల్స్ ఈజీగా గుర్తించవచ్చు. దీని వల్ల బ్యాంకింగ్ మోసాల కేసులు, ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ పెరగవని ఆర్బీఐ నమ్ముతుంది.


Click it and Unblock the Notifications