Bank strike: రెండ్రోజుల బ్యాంకు సమ్మె, ఏటీఎం, బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం
రెండు బ్యాంకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంబరిల్లా ఈ నెల 16, 17వ తేదీన సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ ఇటీవల మాట్లాడుతూ.. బ్యాంకుల ప్రయివేటీకరణ వల్ల ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ రెండు రోజుల సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాగా, సమ్మెను విరమించుకోవాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలను స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) సహా ఇతర PSBలు కోరాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు సూచించాయి. రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే ఆయా బ్యాంకుల కార్యకలాపాలు, ఏటీఎం కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది.

ఎస్బీఐ, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకులు కూడా సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరాయి. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ సమ్మె కారణంగా స్టేక్ హోల్డర్స్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. కస్టమర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరింది. కెనరా బ్యాంకు కూడా ట్వీట్ చేసింది. కస్టమర్లకు ఇబ్బందులు లేని నిరంతర సేవల కోసం సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరింది.


Click it and Unblock the Notifications