bank holidays: నవంబర్, డిసెంబర్ నెలల్లో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే...
వచ్చే నవంబర్ నెలలో, అలాగే ఆ తర్వాత వచ్చే డిసెంబర్ నెలలో బ్యాంకులు వివిధ పండుగల సమయంలో, వివిధ సందర్భాల్లో క్లోజ్ అవుతాయి. ప్రతి ఆదివారం బ్యాంకు బంద్ ఉంటుంది. అలాగే, రెండు, నాలుగో శనివారాల్లోను బ్యాంకులకు సెలవు రోజులు. పండుగలకు సెలవులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన పండుగలకు కూడా ఆ ప్రాంతాల్లో సెలవులు ఉంటాయి. నగదు ఉపసంహరణ, డిపాజిట్, ట్రాన్సుఫర్‌ల కోసం బ్యాంకులకు వెళ్లే పని తగ్గినప్పటికీ, ఇతర అవసరాల కోసం వెళ్తుంటాం. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో బ్యాంకు సెలవులు ఇవే...

నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు
నవంబర్ నెలలో... 3, 10, 17, 24 తేదీల్లో ఆదివారాలు. బ్యాంకులకు సెలవు రోజులు. 9, 23 తేదీలు రెండు, నాలుగో శనివారాలు. ఈ రోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. నవంబర్ 3, 9, 10, 17, 23, 24 పబ్లిక్ హాలీడేస్. నవంబర్ 12వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ. కాబట్టి ఈ రోజు కూడా బ్యాంకులకు సెలవు.

నెట్ బ్యాంకింగ్‌కు ఆటంకాలు లేవు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బ్యాంకులకు సాధారణ పబ్లిక్ హాలీడేస్‌తో పాటు మరొక్క రోజు మాత్రమే సెలవు లభించింది. మంగళవారం గురునానక్ జయంతి లేదా కార్తీక పూర్ణిమ సందర్భంగా సెలవు. ఏపీలో కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. నవంబర్ 10న ఈద్ మిలాద్ పండుగ ఉన్నప్పటికీ ఆ రోజు ఆదివారం. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్‌కు ఎలాంటి ఆటంకాలు లేవు. ఆన్‌లైన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యథావిథిగా ఉంటాయి.

డిసెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు
డిసెంబర్ నెలలో 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు వస్తున్నాయి. అలాగే, 14వ తేదీన రెండో శనివారం కాగా, 28న నాలుగో శనివారం. అంటే డిసెంబర్ నెలలో 7 పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. ఇది కాకుండా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా సెలవు ఉంటుంది. డిసెంబర్ నెలలో మొత్తం 8 సెలవులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications