Bank Holidays: ఈ వారం బ్యాంకులు పనిచేసేది 3 రోజులే.. వరుస సెలవులే..!
April Bank Holidays: ఈ వారం బ్యాంక్‌లో కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయాలనుకునే వారికి ఒక గమనిక. ఈ వారంలో మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే ఈ వారం మొత్తం మూడు రోజులు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి. వరుస సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
గుడి పడ్వా దృష్ట్యా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏప్రిల్ 9న అంటే మంగళవారం మూసివేయబడతాయి. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరం పండుగగా జరుపుకునే ఉగాది కూడా ఉంది. దీనికి తోడు ఈ రోజు నవరాత్రుల మొదటి రోజు అవుతుంది. దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ము, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి.

అలాగే ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా ఈద్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ రోజు బ్యాంకులకు అధికారిక సెలవు కూడా ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ము, శ్రీనగర్‌లలో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 13న రెండవ శనివారం కావటంతో సెలవులో ఉండనున్నాయి. కాబట్టి ఈ వారం బ్యాంకులు సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే పని చేస్తాయి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అవసరమైన లావాదేవీల కోసం ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు లేదా ATMల ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఏదైనా పనికి బ్యాంకు సిబ్బంది సహాయం అవసరమైతే పైన పేర్కొన్న సెలవు తేదీల్లో కాకుండా చూసుకుని దగ్గరలోని బ్యాంకు ఖాతాలకు చేరుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications