Bank Holidays: అక్టోబరులో 18 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..??
October Bank Holidays: రానున్న అక్టోబరు నెలలో బ్యాంకులు ఎక్కువ రోజుల పాటు సెలవులో ఉండవున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండరు ప్రకారం దాదాపు 18 రోజుల పాటు మూసివేయబడతాయని వెల్లడైంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా సెలవులు మారతాయి. ముందుగా అక్టోబరు 1, 2023 ఆదివారం కావటంతో సెలవుతో ప్రారంభమౌతుండగా.. రెండో తేదీ గాంధీ జయంతి కావటంతో బ్యాంకు కార్యాలయాలు భౌతికంగా సెలవులో ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే బ్యాంకుల సెలవులు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం నిర్థేశించబడతాయి.

అక్టోబరు మాసంలో మెుత్తం సెలవుల జాబితాలు గమనిస్తే..
- అక్టోబర్ 1: ఆదివారం
- అక్టోబర్ 2న బ్యాంకులకు సెలవు: మహాత్మా గాంధీ జయంతి (అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి)
- అక్టోబర్ 8: ఆదివారం
- అక్టోబర్ 14న బ్యాంకులకు సెలవు: మహాలయ (కోల్‌కతా), రెండవ శనివారం
- అక్టోబర్ 15: ఆదివారం
- అక్టోబర్ 18న బ్యాంకులకు సెలవు: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
- అక్టోబర్ 21న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)
- అక్టోబర్ 22: ఆదివారం
- అక్టోబర్ 23న బ్యాంకులకు సెలవు: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
- అక్టోబర్ 24న బ్యాంకులకు సెలవు: దసరా/దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
- అక్టోబర్ 25న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
- అక్టోబర్ 26న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
- అక్టోబర్ 27న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
- అక్టోబర్ 28న బ్యాంకులకు సెలవు: లక్ష్మీ పూజ (కోల్‌కతా), నాల్గవ శనివారం
- అక్టోబర్ 29: ఆదివారం
- అక్టోబర్ 31న బ్యాంకులకు సెలవు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)
సెలవుల కారణంగా బ్యాంకులు మూతపడి ఉన్నప్పటికీ.. సేవలను వినియోగదారులు ఎటువంటి ఆటంకం లేకుండా పొందొచ్చు. ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా నిరీక్షణ లేకుండానే అవసరమైన అన్ని సేవలను నిరంతరాయంగా బ్యాంకులు అందిస్తాయి. అయితే భౌతికంగా బ్యాంకు శాఖకు వెళ్లి చేసుకోవాల్సిన పనులు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా సెలవులను చూసుకుని ప్లాన్ చేసుకోవటం తప్పనిసరి.


Click it and Unblock the Notifications