Bank Holidays: సెప్టెంబర్‌లో 14 రోజులు బ్యాంక్స్ బంద్.. ముందుగా మేల్కోండి కస్టమర్స్..
September Bank Holidays: నేటితో ఆగస్టు నెల ముగియనున్న వేళ సెప్టెంబరులో బ్యాంకింగ్ పనిదినాల గురించి అందరి దృష్టి ఉంది. ప్రతినెల మాదిరిగానే 2024 సెప్టెంబరులో దేశంలోని బ్యాంకులు ఆర్బీఐ క్యాలెండరుకు అనుగుణంగా సెలవుల్లో ఉండనున్నందున ప్రజలు వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
భారతదేశంలో బ్యాంకులకు సెలవులు వివిధ రాష్ట్రాలకు వేరువేరుగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. అంటే పైన పేర్కొన్న 14 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో బ్యాంకులు మూతపడి ఉండవని గుర్తుంచుకోవాలి. ప్రాంతీయ పండుగలు, నేషనల్ హాలిడేస్ బట్టి ఇవి మారుతుంటాయి. ఇక వారాంతపు సెలవులు స్థిరంగా కొనసాగుతాయి. ఇక్కడ రిజర్వు బ్యాంక్ సదరు రాష్ట్రాల్లోని ప్రత్యేకమైన పండుగలు, సంప్రదాయాలు, సంస్కృతికి అనుగుణంగా సెలవుల క్యాలెండర్ సిద్ధం చేస్తుంటుంది.

అందువల్ల సెప్టెంబర్ 2024లో సెలవులకు అనుగుణంగా ఖాతాదారులుకు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవటానికి ఈ వివరాలు ఎంతగానో దోహదపడతాయి. అందువల్ల సెప్టెంబర్ బ్యాంక్ హాలిడేజ్ జాబితాను పరిశీలిస్తే..
సెప్టెంబర్ 1, 2024 - ఆదివారం సెలవు
సెప్టెంబర్ 7, 2024 - వినాయగర్ చతుర్థి - ఆల్ ఇండియా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 8, 2024 - ఆదివారం సెలవు
సెప్టెంబర్ 13, 2024 - రామదేవ్ జయంతి / తేజ దశమి (శుక్రవారం) - రాజస్థాన్
సెప్టెంబర్ 14, 2024 - రెండవ శనివారం సెలవు
సెప్టెంబర్ 15, 2024 - ఆదివారం సెలవు
సెప్టెంబర్ 16, 2024 - ఈద్ ఎ మిలాద్ (సోమవారం) - ఆల్ ఇండియా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 17, 2024 - ఇంద్ర జాత్ర (మంగళవారం) - సిక్కిం
సెప్టెంబర్ 18, 2024 - శ్రీ నారాయణ గురు జయంతి (బుధవారం) - కేరళ
సెప్టెంబర్ 21, 2024 - శ్రీ నారాయణ గురు సమాధి (శనివారం) - కేరళ
సెప్టెంబర్ 22, 2024 - ఆదివారం సెలవు
సెప్టెంబర్ 23, 2024 - అమరవీరుల దినోత్సవం (సోమవారం) - హర్యానా
సెప్టెంబర్ 28, 2024 - నాల్గవ శనివారం సెలవు
సెప్టెంబర్ 29, 2024 - ఆదివారం సెలవు
వినియోగదారులకు సాధారణ చెల్లింపుల లావాదేవీలు చేసుకోవటానికి బ్యాంకింగ్ హాలిడేస్ ఎలాంటి అవరోధాలను కలిగించదు. ఈ సమయంలో ఖాతాదారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా, యూపీఐ చెల్లింపు వ్యవస్థ ద్వారా పనులను పూర్తి చేసుకోవచ్చు.
ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ సైతం అందుబాటులోనే ఉంటుంది. అయితే లోన్స్ కి సంబంధించిన ఏదైనా పనులు ఉన్నట్లయితే అందుకోసం ఖచ్చితంగా బ్యాంక్ శాఖను సందర్శించాల్సి ఉంటుందని మనందరికీ తెలుసు. అందువల్ల సెలవు దినాలు కాని రోజుల్లో మీకు సమీపంలోని బ్యాంక్ బ్రాండ్ సందర్శించి పనులను పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఇది చివరి క్షణాల్లో గందరగోళాన్ని నివారించటానికి దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications