చెప్పాపెట్టకుండా క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించేస్తున్న బ్యాంకులు.. కారణం ఇదే, అలర్ట్‌గా ఉండండి!
మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్‌కో లేదా హోటల్‌కో వెళ్లినప్పుడు.. అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ (లిమిట్) ఉన్నా కూడా మీ క్రెడిట్ కార్డు (credit card) ట్రాన్సాక్షన్ డిక్లైన్ (ఫెయిల్) అయిందా? అయితే మీరు వెంటనే మీ కార్డ్ లిమిట్‌ను చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. చాలా మంది కస్టమర్ల క్రెడిట్ కార్డ్ పరిమితులను ముందస్తు సమాచారం లేకుండానే అకస్మాత్తుగా తగ్గించేస్తున్నాయి.
కార్డు లిమిట్ తగ్గిపోయిన విషయం చాలా మందికి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడే బయటపడుతోంది. బ్యాంకులు ఇంత సడన్‌గా ఎందుకు ఇలా లిమిట్లను తగ్గిస్తున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అసలు కారణాలు ఇవే..
- లేట్ పేమెంట్లు చేయడం: మీరు గడువు తేదీ లోపు క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టకుండా ఆలస్యం చేస్తున్నారా? అయితే బ్యాంకులు మీపై నిఘా పెడతాయి. వరుసగా లేట్ పేమెంట్స్ చేస్తుంటే మీ క్రెడిట్ వర్తినెస్ (నమ్మకం) తగ్గిందని భావించి లిమిట్ తగ్గించేస్తాయి.
- కేవలం మినిమం డ్యూ (Minimum Due) మాత్రమే కట్టడం: ప్రతి నెల వచ్చే బిల్లులో మొత్తం అమౌంట్ కట్టకుండా.. కేవలం మినిమం అమౌంట్ మాత్రమే కడుతూ వస్తే, మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని బ్యాంకులు అలర్ట్ అవుతాయి. ఇది కూడా లిమిట్ తగ్గడానికి మెయిన్ రీజన్.
- కార్డును అస్సలు వాడకపోవడం (Dormancy): మీ దగ్గర క్రెడిట్ కార్డు (credit card) ఉంది కానీ, దానిని నెలల తరబడి అస్సలు వాడకుండా పక్కన పెట్టేస్తే.. రిస్క్ కంట్రోల్ చేయడంలో భాగంగా బ్యాంకులు ఆటోమేటిక్‌గా లిమిట్‌ను తగ్గించేస్తాయి.
- సిబిల్ స్కోర్ (CIBIL Score) పడిపోవడం: మీ సిబిల్ స్కోర్ క్రమంగా తగ్గుతూ వస్తుంటే, బ్యాంకులు మీ కార్డుపై రిస్క్ తీసుకోవు. వెంటనే మీ లిమిట్‌కు కత్తెర వేస్తాయి.
- ఎక్కువ అప్పులు ఉండటం (Debt-to-Income Ratio): మీ సంపాదన కంటే మీకున్న పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు వంటి మొత్తం అప్పుల భారం ఎక్కువగా ఉన్నట్లు బ్యాంకులు గుర్తిస్తే.. మీ రీపేమెంట్ కెపాసిటీని బట్టి కార్డు లిమిట్ తగ్గిస్తాయి.
దీనివల్ల మీపై పడే ఇంపాక్ట్ ఏంటి?
కార్డు లిమిట్ తగ్గడం వల్ల మీ పర్చేసింగ్ పవర్ (కొనుగోలు శక్తి) పడిపోవడమే కాకుండా.. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (Credit Utilisation Ratio) ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ. 1,00,000 ఉన్నప్పుడు మీరు రూ. 40,000 వాడితే అది 40% యుటిలైజేషన్ అవుతుంది. కానీ బ్యాంక్ మీ లిమిట్‌ను రూ. 50,000 కి తగ్గిస్తే.. మీరు వాడిన రూ. 40,000 కాస్తా 80% యుటిలైజేషన్‌గా మారిపోతుంది. ఇలా రేషియో పెరిగితే, మీరు క్రెడిట్ (అప్పుల) పై ఎక్కువగా ఆధారపడుతున్నారని వేరే బ్యాంకులు భావిస్తాయి. దీనివల్ల ఫ్యూచర్‌లో మీకు కొత్త లోన్లు రావడం కష్టమవుతుంది.
ప్రస్తుతం మారుతున్న ఆర్థిక పరిస్థితులు, మార్కెట్లో పెరుగుతున్న డిఫాల్ట్ (యాప్‌లు, లోన్లు ఎగ్గొట్టే) రిస్క్‌ల నుండి తమను తాము కాపాడుకోవడానికి బ్యాంకులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కాబట్టి మీ క్రెడిట్ కార్డు లిమిట్ సేఫ్‌గా ఉండాలంటే బిల్లులు ఎప్పటికప్పుడు పూర్తిగా చెల్లించడం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications