ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించడంతో సూచీలు ఎగిశాయి. గత వారం వరుసగా మూడు సెషన్‌లలో నష్టాల్లో ముగిశాయి. అనంతరం ఈ రోజు కోలుకున్నాయి. రెండో త్రైమాసికంలో లాభాలు క్షీణించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ దారుణంగా క్షీణించింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు భారీగా లాభపడగా, నిఫ్టీ ఎనర్జీ భారీగా నష్టపోయింది. ఉదయం ఒకానొక దశలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత 143 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. నిఫ్టీ 11,650 పాయింట్లకు

రిలయన్స్ డౌన్, బ్యాంకింగ్ అదుర్స్
సెన్సెక్స్ 143.51 పాయింట్లు(0.36 శాతం) నష్టపోయి 39,757 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26.80 పాయింట్లు(0.23 శాతం) నష్టపోయి 11,669.20 పాయింట్ల వద్ద ముగిసింది.
1,080 స్టాక్స్ లాభాల్లో, 1,535స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 148 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు.
టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, ఐచర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్ ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

రియాల్టీ, బ్యాంకింగ్ అదుర్స్
నిఫ్టీ ఆటో 0.34 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.48 శాతం, నిఫ్టీ ఐటీ 0.88 శాతం, నిఫ్టీ మీడియా 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.61 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు 4.15 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 3.89 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.04 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు3.36 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.16 శాతం లాభపడ్డాయి.
పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ ఆంక్షలు ప్రారంభం కావడం, అమెరికా ఎన్నికల నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడినప్పటికీ, బ్యాంకింగ్, రియాల్టీ రంగాలు ఆదుకున్నాయి.
ఐటీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్ షేరు 2.13 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.35 శాతం, టెక్ మహీంద్ర 0.27 శాతం, విప్రో 1.82 శాతం, మైండ్ ట్రీ 0.99 శాతం, కోఫోర్జ్ 4.09 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్ స్టాక్ మాత్రమే 0.76 శాతం లాభపడింది.

రిలయన్స్‌కు భారీ షాక్
గత కొన్ని నెలలుగా పెట్టుబడుల సమీకరణ, డిజిటలైజేషన్ కారణంగా రిలయన్స్ స్టాక్ భారీగా ఎగిసింది. సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలతో ఈ స్టాక్ దారుణంగా పతనమైంది. ముఖేష్ అంబానీ దాదాపు 7 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. రిలయన్స్ స్టాక్ 8.69 శాతం క్షీణించి రూ.1876 వద్ద ముగిసింది. మార్చి 23వ తేదీ తర్వాత భారీ పతనం ఇదే. షేర్ హోల్డర్లు రూ.1 లక్ష కోట్ల మేర న్టపోయారు. రిలయన్స్ మార్కెట్ క్యాప్ కూడా భారీగా పడిపోయింది. ఈ ఒక్కరోజే రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12,64,061 కోట్లకు క్షీణించింది. ఓ సమయంలో రూ.15 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లను దాటింది. రిలయన్స్ షేర్లు ఈ ఏఢాది 25 శాతం మేర ఎగిశాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications