గత కొన్ని రోజులుగా బ్యాంకుల విలీనం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో జరిగినట్టుగా మరోసారి ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇది నిజమయ్యేట్టు కనిపిస్తుంది. దీని గురించి ప్రముఖులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
దేశంలో మరోసారి బ్యాంకుల విలీనం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీని గురించి మాట్లాడారు. బ్యాంకుల విలీనం, ప్రైవేటైజేషన్ మంచిదేనని అన్నారు. మన బ్యాంకులు అంతర్జాతీయ బ్యాంకులుగా ఎదగాలంటే చిన్న బ్యాంకులన్నీ కలిపి పెద్ద బ్యాంకులుగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో మరోసారి బ్యాంకుల విలీనం గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్యాంకులను మెర్జ్ చేసి పెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది. అప్పుడే దేశంలో పెద్ద బ్యాంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

గతంలో 2020 లో చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మెగా బ్యాంకుల విలీన ప్రక్రియకు కేంద్రం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 12 ప్రభుత్వ బ్యాంకుల్ని.. 8 కి పరిమితం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ అమలయ్యే అవకాశం ఉంది. తాజాగా SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ బ్యాంకుల విలీనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి విలీనం జరిగితే మంచిదేనని అన్నారు. విలీనం జరిగినా కూడా చిన్న బ్యాంకులు మనుగడలోనే ఉంటాయని ఆయన అన్నారు.
గతంలో ఇలా..
మన బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకునేలా చేయడం కోసం ప్రభుత్వం కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న 27 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 12కి తగ్గించింది. 2020 లో 10 చిన్న ప్రభుత్వ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా మారాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయ్యాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాయి. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనమైంది. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమైంది.
ఇప్పుడు ఇలా..
ఇక ఇప్పుడు కాబోయే విలీన ప్రక్రియ విషయానికొస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు SBI తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రెండో అతిపెద్ద బ్యాంకుగా మారుతుంది. అలాగే SBI లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న బ్యాంకులు విలీనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. లేదా వీటిలో కొన్నింటిని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయొచ్చు. ఒకవేళ విలీనం జరిగితే.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులే చెలామణిలో ఉంటాయి. ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు కొత్త బ్యాంకుకి కస్టమర్లుగా మారతారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications