ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే నిమిషాల్లో బ్యాంక్ ఖాతాను తెరిచే సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ సులభతరమైన పద్ధతే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. కేవలం ఆధార్ ఓటీపీ (e-KYC) ఆధారంగా ఖాతాలు తెరిచే విధానాన్ని ఆసరాగా చేసుకుని, కేటుగాళ్లు ఇతరుల పేర్లతో 'మ్యూల్ ఖాతాలను' సృష్టించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముప్పును గుర్తించిన బ్యాంకులు ఇప్పుడు తమ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి.

ఆధార్ ఓటీపీ విధానంలో ఉన్న లోపం ఏమిటి?
ఇప్పటివరకు ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే సులభంగా ఖాతా ప్రారంభమయ్యేది. కానీ, ఈ పద్ధతిలో ఆధార్ వివరాలు ఉన్న వ్యక్తి నిజంగా ఆయనేనా? లేదా ఆ వివరాలను మరెవరైనా వాడుతున్నారా? అనేది బ్యాంక్ అధికారులకు తెలిసే అవకాశం లేదు. కేవలం డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అయిపోయేది. దీన్ని అడ్డుకోవడానికి బ్యాంకులు ఇప్పుడు వీడియో కైవైసీ (Video KYC) ని తప్పనిసరి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
వీడియో కేవైసీ (Video KYC) ఎలా పనిచేస్తుంది?
ఈ విధానంలో కేవలం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం సరిపోదు. బ్యాంక్ ప్రతినిధితో వీడియో కాల్‌లో నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఖాతాదారుడు తన ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డులను కెమెరా ముందు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సదరు వ్యక్తి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో వారి 'లైవ్ లొకేషన్' రికార్డు అవుతుంది. దీనివల్ల డీప్ ఫేక్ వీడియోలు లేదా ఇతరుల ఫోటోలను ఉపయోగించి మోసం చేయడం అసాధ్యం అవుతుంది.
గ్రామీణ ప్రాంతాల కోసం 'అసిస్టెడ్ కేవైసీ'
స్మార్ట్‌ఫోన్ వాడడం రాని వారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి కోసం 'అసిస్టెడ్ వీడియో కేవైసీ' సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీని ద్వారా ఖాతాదారుడు తన కుటుంబ సభ్యుల సహాయంతో వీడియో కాల్ పూర్తి చేయవచ్చు. గతంలో కేవలం ఓటీపీ ద్వారా తెరిచిన ఖాతాలకు లావాదేవీల పరిమితి ఉండేది, కానీ, వీడియో కేవైసీ (Video KYC) పూర్తి చేసిన వెంటనే ఆ ఖాతా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
బ్యాంకులు ఎప్పుడూ కేవైసీ అప్‌డేట్ కోసం లింకులను పంపవని గుర్తుంచుకోండి. "మీ కేవైసీ గడువు ముగిసింది.. ఈ లింక్ క్లిక్ చేయండి" అంటూ వచ్చే ఫేక్ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఖాతా భద్రంగా ఉండాలంటే స్వయంగా బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వీడియో కైవైసీ (Video KYC) ప్రక్రియను పూర్తి చేయడం శ్రేయస్కరం. ఈ కొత్త మార్పులు మన సొమ్మును సైబర్ దొంగల బారి నుండి రక్షించేందుకేనని గ్రహించి.. బ్యాంకులకు సహకరించడం మన బాధ్యత.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications