Bank Holidays: వచ్చే వారం బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు..!

వచ్చే వారం బ్యాంకు పనులు ఉన్నవారు సెలవులను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారు పలు రాష్ట్రాల్లో బ్యాంకులు నాలుగు రోజుల మూసివేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 మధ్య, ఎంపిక చేసిన నగరాల్లోని బ్యాంకులు నాలుగు రోజుల వరకు మూసివేయనున్నారు. దీంతో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, PNB వంటి ప్రధాన బ్యాంకులలో భౌతిక సేవలు నిలిపివేయనున్నారు. సెలవు దినం పాటించే ప్రాంతాలలో నగదు డిపాజిట్లు మరియు చెక్కులకు సంబంధించిన పనుల వంటి శాఖా-ఆధారిత కార్యకలాపాలు నిలిపివేసినప్పటికీ.. వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ ద్వారా తమ ఆర్థిక లావాదేవీలను కొనసాగించవచ్చు.

ఈ వారంలో బ్యాంకు సెలవులను పరిశీలిస్తే సెప్టెంబర్ 21న శ్రీమంత శంకరదేవ/శ్రీ నారాయణ గురు సమాధి జన్మోత్సవం నిర్వహించనున్నారు. భువనేశ్వర్, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 22న కర్మ పూజ సందర్బంగా రాంచీలో బ్యాంకులు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 23న మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్బంగా జమ్మూ, శ్రీనగర్ బ్యాంకులు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 25న ఇంద్రజాతర సందర్భంగా గాంగ్‌టక్ బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు.

Bank Holidays

సెప్టెంబర్ 27న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ అవుతాయి. చెల్లింపులు, నిధుల బదిలీలు, ఇతర డిజిటల్ లావాదేవీల కోసం వినియోగదారులు సాధారణంగా యూపీఐ, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణలు, ఇతర మద్దతు ఉన్న లావాదేవీల కోసం ఏటీఎం సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. ఆర్‌టిజిఎస్ వ్యవస్థ బ్యాంకు సెలవులతో సహా 24x7x365 అందుబాటులో ఉంటుంది. అయితే కొన్ని ఖాతా సంబంధిత అభ్యర్థనలు లేదా డాక్యుమెంటేషన్ వంటి భౌతిక శాఖ సందర్శన అవసరమయ్యే సేవలు, శాఖ తిరిగి తెరిచే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

బ్యాంకు సెలవులు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక రాష్ట్రం లేదా నగరానికి పేర్కొన్న సెలవు తమ బ్రాంచ్‌కు కూడా వర్తిస్తుందని వినియోగదారులు భావించకూడదు. ఆర్‌బిఐ సెలవుల క్యాలెండర్ ప్రాంతాల వారీగా షెడ్యూల్‌ను అందిస్తుంది. కాబట్టి బ్రాంచ్‌ను సందర్శించడానికి ప్రణాళిక వేసుకునే ముందు సంబంధిత నగరాన్ని తనిఖీ చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+