Banks: ప్రభుత్వ ఉద్యోగాలకు దేశంలో ఉన్న గిరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ బ్యాంకు జాబ్ అంటే ఎటువంటి టెన్షన్లు ఉండవు. కానీ ఎప్పటి నుంచో బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్న ఓ అసంతృప్తి వారాంతపు సెలవులు. అయితే త్వరలోనే వారు శుభవార్త విననున్నట్లు వార్తలు వస్తున్నాయి. పని దినాలను తగ్గించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పరిశీలిస్తున్న అసోసియేషన్:
బ్యాంకు ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం గురించిన వార్త, మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారంలో 5 రోజుల పనిదినాల కోసం బ్యాంకు యూనియన్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) వాటిని పరిగణలోనికి తీసుకుని, పరిశీలిస్తోందని ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. అంటే త్వరలోనే వారికి వారానికి 2 రోజుల వీక్లీ ఆఫ్‌లు లభించనున్నాయన్నమాట.

అసోసియేషన్, యూనియన్ల మధ్య చర్ఛలు:
ఈ విషయంపై IBA, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (UFBEs) మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు ప్రత్యామ్నాయ శనివారాల్లో పని చేస్తున్నారు. అయితే 5 రోజుల పని దినాల అమలుకు అసోసియేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఈ విధానం ప్రకారం పని గంటలను పెంచే అవకాశం లేకపోలేదని మీడియా నివేదిక పేర్కొంది.

పని గంటల మాటేమిటంటే..
ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ పేర్కొన్నారు. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఇందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు సిబ్బంది, ప్రతిరోజూ ఉదయం 9.45 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తున్నారు. కానీ రెండు రోజులు వీక్లీ ఆఫ్ లు అందుబాటులోకి వస్తే మాత్రం అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది.

ఈ నెలలో సెలవులు ఇవే:
రెండవ నాలుగవ శనివారాలు, ఆదివారాలతో సహా మార్చి 2023లో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటిలో కొన్ని దేశవ్యాప్త సెలవులు ఉండగా, మరికొన్ని స్థానిక సెలవులు. హోలీ, చైత్ర నవరాత్రి, రామనవమి వంటి పండుగలు సైతం ఈ నెలలోనే ఉండటం మరో కారణం. ప్రభుత్వ సెలవు దినాలను అన్ని బ్యాంకులు, ప్రాంతీయ పండుగలను కొన్ని బ్యాంకులు సెలవుగా పాటిస్తాయి. ఈ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల ఆధారంగా నోటిఫై చేయబడి ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications