బ్యాంకు సేవలు పొందే కస్టమర్లక్ అలర్ట్! సాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకుతో పని ఉంటుంది. అయితే బ్యాంకులు నిర్ణీత సమయంలోనే పని చేస్తాయి. అందుకే ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు బ్యాంకింగ్ పనులు పెట్టుకోరు. అలాగే, ఆయా బ్యాంకు సమయాన్ని బట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు బ్యాంకు సేవల కోసం వెళ్తుంటారు. తాజాగా ఆర్బీఐ.. బ్యాంకులు తెరిచే సమయాలను మార్చింది. ఇవి నేటి నుండి (ఏప్రిల్ 18) నుండి అమల్లోకి వచ్చాయి.
ఇక్కడ బ్యాంకు కస్టమర్లకు కాస్త ఊరట. నేటి నుండి బ్యాంకులు అదనపు పని గంటలు పని చేస్తాయి. సోమవారం (నేటి నుండి) బ్యాంకులు ఉదయం గం.9కి తెరుచుకుంటాయి. అయితే క్లోజింగ్ సమయం మాత్రం యథాతథంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకులు తెరుచుకునే సమయాలను గతంలో ఆర్బీఐ తగ్గించింది. ఇప్పుడు క్రమంగా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నందున నేటి నుండి పని గంటలను మార్చింది.

అలాగే, తమ నియంత్రణలోని మార్కెట్ ట్రేడింగ్ సమయాలలో కూడా ఆర్బీఐ మార్పులు చేసింది. కొత్త ట్రేడింగ్ సమయం కూడా సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నియంత్రణలో నడిచే మార్కెట్లు, కాల్ మనీ, గవర్నమెంట్ పేపర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పోరేట్ బాండ్స్ రెపో, రూపాయి వడ్డీ రేట్ల డెరివేటివ్స్ సమయాల్లో మార్పులు వచ్చాయి. ఉదయం గం.9 నుండి మధ్యాహ్నం గం.3.30 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేది.
వివిధ టైమింగ్స్
1. కాల్/నోటిస్/టర్మ్ మనీ - 10:00 am to 3:30 pm 9:00 am to 3:30 pm
2. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ రెపో - 10:00 am to 2:30 pm 9:00 am to 2:30 pm
3. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రై-పార్టీ రెపో - 10:00 am to 3:00 pm 9:00 am to 3:00 pm
4. కమర్షియల్ పేపర్ అండ్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ - 10:00 am to 3:30 pm 9:00 am to 3:30 pm
5. రెపో ఇన్ కార్పోరేట్ బాండ్స్ -10:00 am to 3:30 pm 9:00 am to 3:30 pm
6. గవర్నమెంట్ సెక్యూరిటీస్(Central Government Securities, State Development Loans and Treasury Bills) - 10:00 am to 3:30 pm 9:00 am to 3:30 pm
7. ఫారెన్ కరెన్సీ/ఇండియన్ రూపీ ట్రేడర్స్ (ఫారెక్స్ డెరివేటివ్స్ సహా) - 10:00 am to 3:30 pm 9:00 am to 3:30 pm
8. రుపీ ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్ - 10:00 am to 3:30 pm 9:00 am to 3:30 pm


Click it and Unblock the Notifications