Akshaya Tritiya offers: జ్యూయలరీ షాపులతో బ్యాంకులు పోటీ.. అక్షయ తృతీయ వేళ ఆఫర్స్ వర్షమే
Car Loans: అక్షయ తృతీయ వస్తుందంటే చాలు మగువలు బంగారం కొనుగోళ్లపై మక్కువ చూపిస్తుంటారు. అయితే పసిడితోపాటు నగలు, ఇల్లు, కారు వంటివి కొనడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఆయా సంస్థలు కూడా పలు ఆఫర్లు ప్రకటించి సేల్స్ పెంచుకునేందుకు పోటీ పడుతుంటాయి. ఈ రేసు కాస్తా బ్యాంకులకూ పాకింది. నువ్వానేనా అంటూ పోటీపడి మరీ కస్టమర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ సిద్ధమైంది. అక్షయ తృతీయ 2024 సందర్భంగా కార్ల సేల్స్ పెంచుకునేందుకు వివిధ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి బ్యాంకులు చౌకగా రుణాలనూ అందజేస్తున్నాయి. ఇందుకు అదనంగా ప్రాసెసింగ్ ఫీజులపైనా తగ్గింపును అందిస్తున్నాయి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తక్కువ వడ్డీకే కారు రుణాలను మంజూరు చేసేందుకు ముందుకు వచ్చాయి. 8.70 శాతం నుంచి 9.30 శాతం మధ్య బ్యాంకును బట్టి ఈ రేటు మారుతూ ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు వడ్డీరేట్లు కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ 4 ఏళ్ల పాటు 10 లక్షల వరకు కార్ లోన్‌లను అందిస్తున్నాయి. అన్ని బ్యాంకులూ 25 వేల లోపే EMI విధానంలో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 8.70 నుంచి 8.85 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు 8.90 నుంచి 9.30 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications