Bank Account: కంపెనీలు మారుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. ఉదాహణకు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆ కంపెనీ వారు ఎక్స్ అనే బ్యాంకులో ఖాతా తీసుకోవాలని సూచించారు. దీంతో శ్రీనివాస్ ఎక్స్ అనే బ్యాంకులో ఖాతా ఓపెన్ చేశాడు.
ఆ కంపెనీలో శ్రీనివాస్ రెండు సంవత్సరాలు పని చేసి మరో కంపెనీకి మారాడు. అక్కడ ఆ కంపెనీ వారు వై అనే బ్యాంకులో ఖాతా తెరవాలని చెప్పారు. దీంతో వై లో ఖాతా ఓపెన్ చేశాడు. అతని శాలరీ వై బ్యాంకు ఖాతాలో పడుతోంది. ఇలా రెండేళ్లు పూర్తియ్యాయి. అయితే శ్రీనివాస్ కు డబ్బు అవసరం రావడంతో పీఎఫ్ లోని కొంత మొత్తం డ్రా చేశాడు. ఆ డబ్బు ఎక్స్ బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ ఖాతాలో అప్పటికే మైనస్ బ్యాలెన్స్ ఉండడంతో దాదాపు రూ.10 వేలు కట్ అయ్యాయి.

దీంతో శ్రీనివాస్ ఎక్స్ బ్యాంకు సంప్రదించగా.. మీరు మినీమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదు, అలాగే పలు ఛార్జీల కారణంగా మీ బ్యాలెన్స్ మైనస్ లోకి వెళ్లాయి. డబ్బులు రాగా మైనస్ లో ఉన్న డబ్బులు కట్ అయినట్లు చెప్పారు. ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ బ్యాంకు ఉగ్యోగి అయిన తన స్నేహితుడికి ఫోన్ చేశాడు.
స్నేహితుడి సూచనతో ఆర్‌బీఐ రూల్ ప్రకారం శ్రీనివాస్ బ్యాంకు అధికారికి మెయిల్ చేశారు. అలాగే స్థానికంగా ఉన్న ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్ కు కూడా ఈ సమస్యను వివరిస్తూ మెయిల్ చేశారు. మరసటి రోజు ఎక్స్ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి ఒక సంతకం చేస్తే చాలు మీ డబ్బులు వస్తాయని చెప్పాడు. ఈ మధ్యే బ్యాంక్‌లకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారులకు ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని స్పష్టం చేసింది.
ఎవరైనా ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారి మరో బ్యాంకులో ఖాతా తెరిచినట్లయితే మూడు నెలలోపు ఆ ఖాతా మూసివేయాలి. మీ శాలరీ అకౌంట్ మూడు నెలల వరకు ఎలాంటి డబ్బు కాకుండా ఆ ఖాతా ఆటోమెటిక్ గా సేవింగ్స్ అకౌంట్ మారిపోతుంది. అప్పుడు మీరు మినీమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకుంటే మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్తోంది.


Click it and Unblock the Notifications