Bank Holidays: వరుసగా ఐదు రోజులు మూతపడనున్న ప్రభుత్వ బ్యాంకులు..!
ఒకప్పుడు ఏ చిన్న బ్యాంకు పని అయినా కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారింది. యూపీఐ, నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయడమే కాదు.. డబ్బులు డిపాజిట్ కూడా చేస్తున్నాం. టెక్నాలజీ అప్డేట్ తో బ్యాంకులకు వెళ్లాల్సిన పని తప్పింది. అయితే కొన్ని పను కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఖాతా తెరవాలన్నా, భారీగా డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, చెక్ తో డబ్బులు డ్రా చేయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా బ్యాంకుల్లో పని ఉన్నవారు బ్యాంకు పని దినాలు చూసుకుని వెళ్లడం మంచిది.
వచ్చే వారం బ్యాంకులు ఐదు రోజులపాటు మూతపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అంటే 3 రోజుల పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 25 నాలుగో శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం ఈ రెండు రోజులతో పాటు, సెప్టెంబర్ 28,29,30 బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉండనుంది. అంటే మొత్తం 5 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దేశంలోనే పెద్ద బ్యాంకు ఎస్బీఐ తన కస్టమర్లకు అత్యవసరమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని కోరింది.

సమ్మె కాలంలో బ్యాంక్ బ్రాంచ్ లు మూసేవేసే అవకాశం ఉన్న నేపథ్యంలో లావాదేవీలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బ్యాంకు పేర్కొంది. అయినప్పటికీ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పింది. బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అత్యవసరమైన క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్, విత్‌డ్రాయల్ మెషీన్లు.. అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, YONO యాప్, యూపీఐ వంటి డిజిటల్ ఛానెల్స్ ద్వారా డబ్బు పంపటం, సాధారణ చెల్లింపులు ఎలాంటి అంతరాయం లేకుండా చేసుకోవచ్చని పేర్కొంది.
ఫిజికల్ డాక్యుమెంట్లు అందించాల్సిన పనులు, కొన్ని ప్రత్యేక చెక్-సంబంధిత పనులకు డిజిటల్ ద్వారా పూర్తి చేయడం సాధ్యపడదని.. అలాంటి పనులున్నవారు సమ్మె ప్రారంభమయ్యే ముందే పూర్తి చేసుకోవడం మంచిదని సూచించింది. వీటి కోసం చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగదని చెప్పింది. సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులే సమ్మె చేసే అవకాశం ఉంది. అంటే ప్రైవేట్ బ్యాంకులు తెరిచి ఉండనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
