ద్రవ్యల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రెపో రేటును మరోసారి పెంచింది. దీంతో బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వారి ఈఎంఐ పెరగనుంది. ముఖ్యంగా హోం లోన్ తీసుకున్న వారి భారం ఎక్కువగా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రుణం తీసుకున్న వారికి వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (EMI)లో మార్పు ఉండదు కానీ రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది.

రూ. 50 లక్షల రుణానికి..
ఉదాహరణకు ఎస్బీఐలో రూ. 50 లక్షల హోం తీసుకున్నారనుకుంటే.. 240 నెలలు వ్యవధి ఉంది అనుకుంటే ప్రస్తుత SBI వడ్డీ రేటు 7.65 ప్రకారం నెలకు రూ.40,739 చెల్లించాల్సి ఉంటుంది. అయితే అర్బీఐ రేపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఒక వేళ బ్యాంకుల కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచితే హోం లోన్ తీసుకున్న వారిపై భారం పడుతుంది.

ఈఎంఐ పెరుగుతుంది..
పై కేసులో వడ్డీ రేటు పెరిగితే పాత ఈఎంఐలో ఎలాంటి మార్పు చేయకపోతే లోన్ వ్యవధి 265 నెలలకు పెరుగుతుంది. వ్యవధి 240 నెలలే ఉంచుకుంటే ఈఎంఐ పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగితే ఈ కేసులో నెలకు రూ.42,289 చెల్లించాల్సి ఉంటుంది. అది 240 నెలల కాలానికి. దాదాపు అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది.

పెంపు ఇంకా ఉంటుందా..
ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే.. వడ్డీరేట్ల పెంపు విషయంలో భవిష్యత్తులో ఆర్‌బీఐ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్లు ఇప్పుడున్న స్థాయి నుంచి మరో 35-50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో లోన్లు తీసుకున్నవారి మరింత భారం పడే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications