Bank Strike: డిసెంబర్ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ సెలవులతో పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మే కారణంగా వినియోగదారులు కొంత ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది.
డిసెంబర్ 4 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు పెద్ద స్థాయిలో సమ్మే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించి ఏఏ రోజుల్లో ఏఏ బ్యాంకులు సమ్మేలో పాల్గొంటాయనే వివరాలను ప్రకటించారు. AIBEA ప్రధాన కార్యదర్శి CH. వెంకటాచలం దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్ ఉద్యోగులు డిసెంబర్ 4న సమ్మె చేయనున్నారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు డిసెంబర్ 5న సమ్మె చేయనున్నారు. కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు డిసెంబర్ 7న, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు డిసెంబర్ 8న సమ్మె చేయనున్నారు. డిసెంబర్ 11న దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు సమ్మె చేయనున్నాయి.
బ్యాంకుల్లో పర్మినెంట్ ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌ను ప్రభుత్వం నిలిపివేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బ్యాంకుల్లో అవార్డ్ స్టాఫ్‌ను తగినన్ని నియమించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ తన డిమాండ్ల జాబితాలో పేర్కొంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications