Multibagger stocks: భారీ రిటర్న్స్ ఇవ్వనున్న బ్యాంకింగ్ స్టాక్స్.. 40 మంది అనలిస్టులు మెచ్చిన బ్యాంక్స్
Banking stocks: కేంద్రంలో మరోసారి BJP ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్నరోజుల్లో పలు స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయని మార్కెట్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. వీటిలో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఓ రేంజ్ లో దూసుకుపోతాయని పలువురు అనలిస్టులు భావిస్తున్నారు. ఆ బ్యాంకింగ్ స్టాక్స్ వివరాలు ఏంటో చూద్దాం.
వివిధ సంస్థలకు చెందిన దాదాపు 40 మంది అనలిస్టులు 5 బ్యాంకింగ్ స్టాక్ లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. రానున్న ఏడాదిలో 30 శాతానికి పైగా అవి దూసుకుపోతాయని వారు అంచనా వేసినట్లు ప్రకటించింది. వీటిలో ఏ ఒక్క ప్రభుత్వ బ్యాంకు లేకపోగా.. రెండు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు చోటు దక్కించుకున్నాయి. మిగతా 3 ప్రైవేట్ బ్యాంకులే కావడం గమనార్హం.

ఈ జాబితాలో మొదటగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుని అని చెప్పుకోవచ్చు. మరో ఏడాదిలో 29 శాతానికి పైగా ఈ స్టాక్ పెరగవచ్చని దాదాపు 20 మంది విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుత ధర 95 నుంచి టార్గెట్ రేట్ 123గా ఉండవచ్చని తెలిపారు. 26.8 శాతం రిటర్న్స్ అంచనాలతో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ 2 లో నిలిచింది. 41 మంది విశ్లేషకులు టార్గెట్ ను 1850గా చెబుతున్నారు.
ప్రైవేట్ రంగంలో సేవలందిస్తున్న DCB బ్యాంక్ 23.3 శాతం రిటర్న్స్ జనరేట్ చేయవచ్చు అని అనలిస్టులు చెబుతున్నారు. 20 మంది దీనికి మద్దతిస్తుండగా టార్గెట్ ధర 160 గా పేర్కొన్నారు. ఇక దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC 22.8 శాతం పెరిగే ఛాన్స్ ఉందని 40 మంది అంచనా వేస్తున్నారు. టార్గెట్ ధర 1880గా లెక్కలేస్తున్నారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 20 శాతం మేర బుల్లిష్‌గా ఉండనుందని భావిస్తుండగా 65 టార్గెట్ ను రీచ్ కావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications