Mutual Funds: గతంలో ప్రతి అవసరానికీ బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ అన్నీ అరచేతిలోకే వచ్చేయడంతో అటువైపు చూసేవారే కరవయ్యారు. డబ్బు దాచుకోవడానికి కూడా బ్యాంకుల కంటే ఇతర మార్గాలపైనే దృష్టిసారిస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలను వేగంగా కోల్పోతున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్‌లలోకి నగదు ప్రవాహం పెరగడంతో బ్యాంకింగ్ రంగం ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు, నికర వడ్డీ మార్జిన్లు సాధించేందుకు కష్టపడుతున్నట్లు చెప్పారు.

కరెంట్ మరియు సేవింగ్స్ అకౌంట్ (CASA) వృద్ధి ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 'PSBలలో డిపాజిట్స్ వృద్ధి రేటు దాదాపు 13 శాతం కాగా అడ్వాన్స్‌ల వృద్ధి 16 శాతంగా ఉంది. చాలా ఏళ్లుగా ఇదే జరుగుతోంది. PSBల పనితీరును ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే కాకుండా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు ఇబ్బందికరం' అని జోషి అభిప్రాయపడ్డారు.
ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని బ్యాంకుల నుండి మ్యూచువల్ ఫండ్స్ తరహా ఇతర సాధనాలకు తరలించడమే దీనికి కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్యాంకులకు ఇదే అతిపెద్ద సవాలుగా మారుతుందని అంచనా వేశారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక కలిగి ఉండటం అవసరమన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications