SBI News: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్ 'YONO ఫర్ ఎవ్రీ ఇండియన్'ని పునరుద్ధరించింది. దీని ద్వారా ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
తాజాగా బ్యాంక్ తీసుకొచ్చిన సౌకర్యం డిజిటలైజెన్ లక్ష్యాలకు అనుగుణంగా జరిగింది. ఈ సౌకర్యం ద్వారా కస్టమర్లు ఇకపై డెబిట్ కార్డ్ లేకుండా ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం YONO యాప్ అప్‌డేట్ చేయబడిందని SBI చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఆటంకాలు లేని సేవలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి కోసం యోనోను నిజం చేయాలనే తమ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

దేశంలోని ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఇప్పుడు YONO యాప్ కొత్త వెర్షన్‌ని ఉపయోగించి యూపీఐ ఫీచర్స్ Scan & Pay, Pay by Contact, Request Moneyలను డబ్బు పంపటం, పొందటం చేయవచ్చని బ్యాంక్ వెల్లడించింది. దీనికి తోడు ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ మనీ విత్‌డ్రావల్ సదుపాయం కింద SBI, ఇతర బ్యాంక్ ఖాతాదారులు 'UPI QR మనీ' ఫంక్షనాలిటీని ఉపయోగించి ఏదైనా బ్యాంక్ ICCW-సాధికారత కలిగిన ATM నుంచి డబ్బును తీసుకోవచ్చు. ఈ సౌకర్యం కస్టమర్‌లకు మెరుగైన భద్రతకు కూడా ఉపయోగపడుతుంది.

YONO 2017లో ప్రారంభించినప్పటి నుంచి 6 కోట్ల కంటే ఎక్కువ మంది రిజిస్టర్డ్ వినియోగదారులతో దేశంలో అత్యంత విశ్వసనీయ డిజిటల్ బ్యాంకింగ్ యాప్‌గా అవతరించింది. ఈ మేలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యోనోలో కొత్త ఖాతా ఓపెనింగ్, రుణాల పంపిణీలో క్షీణతను చూసింది. అయితే సాంకేతిక సమస్యలు దీనికి ఒక కారణంగా ఉందని వెల్లడైంది.


Click it and Unblock the Notifications