Q1 Results: దేశంలోని ప్రైవేటు బ్యాంకులు నేడు ఒకదాని తర్వాత మరొకటి తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే బ్యాంకింగ్ రంగం అద్భుత ఫలితాలు ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచేస్తున్నాయి.
నేడు ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ తన లాభాలు ఏడాది ప్రాతిపదికన 81.03 శాతం పెరిగినట్లు ప్రకటించింది. దీని ప్రకారం జూన్ త్రైమాసికంలో కంపెనీ నికల లాభం రూ.6,249.82 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి గడచిన ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం కేవలం రూ.3,452.30 కోట్లుగా ఉంది. అలాగే తొలి త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం 18.90 శాతం వృద్ధితో రూ.15,675.15 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి జ్యూరిచ్ ఇన్సూరెన్స్ గ్రూప్‌కు కోటక్ తన బీమా అనుబంధ సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో బ్యాంక్ వాటా విక్రయం కారణంగా నికర లాభం రూ.3012 కోట్లు పెరిగినట్లు వెల్లడించింది.

గ్రూప్ నికర లాభం రూ.4,435 కోట్లుగా ఉందని బ్యాంక్ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్‌లో పేర్కొంది. వాస్తవానికి బ్రోకరేజ్ కంపెనీలు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ. అలాగే బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.6,842 కోట్లుగా నమోదైంది. Q1FY25కి నికర వడ్డీ మార్జిన్ 5.02 శాతంగా ఉంది. రుణదాత స్థూల నిరర్థక ఆస్తులుగత ఏడాది 1.77 శాతం నుంచి తగ్గి ప్రస్తుతం నివేదిస్తున్న త్రైమాసికంలో 1.39 శాతంగా నమోదయ్యాయి. జూన్ 30 నాటికి బ్యాంక్ అడ్వాన్సూలు గత ఏడాదితో పోల్చితే 20 శాతం పెరిగి రూ.4.05 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
గత ఏడాది రూ.3.61 లక్షల కోట్లతో పోలిస్తే క్యూ1ఎఫ్‌వై25లో రుణదాత మొత్తం డిపాజిట్లు 21 శాతం పెరిగి రూ.4.35 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఫలితాల్లో నివేదించింది. అలాగే కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 3 శాతం వృద్ధితో రూ.1.94 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన CASA డిపాజిట్లు 5 శాతం పడిపోయాయి. శుక్రవారం కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు త్రైమాసిక ఫలితాలకు ముందు చివరిసారిగా 0.81 శాతం తగ్గి రూ.1,812 వద్ద స్థిరపడ్డాయి. 2024లో ఇప్పటి వరకు స్టాక్ పనితీరును గమనిస్తే 5.09 శాతం పడిపోయింది. వాస్తవానికి దీనికి ఆర్బీఐ చర్యలు ఒక ప్రధాన కారణంగా ఉంది.


Click it and Unblock the Notifications