HDBFin IPO: దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి తాజాగా నేడు తన క్యూ1 ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 35.3 శాతం పెరిగి రూ.16,174.75 కోట్లుగా నిలిచింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం రూ.83,701 కోట్లుగా నమోదైంది.
బ్యాంక్ నికర నికర ఎన్‌పీఎ మెుదటి త్రైమాసికంలో రూ.9,508.44 కోట్లుగా ఉన్నాయి. జూన్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 24.4 శాతం పెరిగి రూ.23.79 లక్షల కోట్లుగా ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ.5.97 లక్షల కోట్లుగా ఉండగా.. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.2.67 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ నివేదించింది. టైమ్ డిపాజిట్ రూ. 15.15 లక్షల కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

ఇదే సమయంలో బ్యాంక్ బోర్డు శనివారం తమ ఫైనాన్స్ వ్యాపారం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ని దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఐపీవోగా లిస్టింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి దాని డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ అవసరాల దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
రిజర్వు బ్యాంక్ అక్టోబరు 2022లో జారీ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం అప్పర్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(NBFC)ల లిస్టింగ్ తప్పనిసరి చేస్తుంది. లిస్టింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి , సంబంధిత నియంత్రణ అధికారుల నుంచి అవసరమైన అనుమతులను పొందడానికి బోర్డు డైరెక్టర్ల కమిటీకి అధికారం ఇచ్చింది. ఐపీవో ఆమోదంతో పాటు బోర్డు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జూలై 21, 2024 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త కంపెనీ సెక్రటరీ అండ్ కంప్లయన్స్ ఆఫీసర్‌గా అజయ్ అగర్వాల్ నియామకం అమలులోకి వచ్చింది. సంతోష్ హల్దాంకర్ తర్వాత అగర్వాల్ బాధ్యతలు స్వీకరిస్తారు.


Click it and Unblock the Notifications