బ్యాంకుల్లో ఫ్రాడ్ కేసులు భారీగా తగ్గాయి. ప్రయివేటురంగంతో పాటు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోను మోసం కేసులు భారీగా తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కేసులు 265 కాగా, FY22లో 118కి తగ్గాయి. అంటే సగాని కంటే ఎక్కువగా పడిపోయాయి. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ ఫ్రాడ్ కేసులకు సంబంధించిన నివేదిక ఇది. FY22లో ఈ ఫ్రాడ్ కేసుల వ్యాల్యూ రూ.41,000 కోట్లు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (FY21)లో అయితే ఏకంగా రూ.1.05 లక్షల కోట్లుగా నిలిచింది.
ప్రభుత్వరంగ బ్యాంకుల విషయానికి వస్తే రూ.100 కోట్ల ఫ్రాడ్ కేసులు FY21లో 167 ఉండగా, FY22 నాటికి 80కి తగ్గాయి. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో ఫ్రాడ్ కేసులు 98 నుండి 38కి తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని ఫ్రాడ్ కేసుల మొత్తం వ్యాల్యూ FY21లో రూ.65,900 కాగా, FY22లో రూ.28,000కు, ప్రయివేటురంగ బ్యాంకుల్లో
అయితే రూ.39,900 కోట్ల నుండి రూ.13,000 కోట్లకు తగ్గాయి.

ఫ్రాడ్‌స్టర్స్‌కు చెక్ పెట్టడానికి ఆర్బీఐ, బ్యాంకులు ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ, కొన్ని పెద్ద మోసాలు బయటపడుతున్నాయి. దేశ బ్యాంకింగ్ చరిత్రలో నమోదైన అతిపెద్ద మోసాల్లో ఒకటైన రూ.22,842 కోట్ల ఏబీజీ షిప్ యార్డ్ మోసం ఈ ఏడాది వెలుగు చూసింది. ఎస్బీఐ ఫిర్యాదుతో ఈ కంపెనీ ప్రమోటర్లపై ప్రస్తుతం కేసు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications